
అడివి శేష్ టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న టాలెంటెడ్ యంగ్ హీరోల్లో ముందువరుసలో నిలిచారు. కెరీర్ ఆరంభం నుంచి వైవిధ్యమైన కథలు ఎంచుకుంటూ, తన స్టైల్‌లో నటిస్తూ వరుస విజయాలను సాధిస్తూ వస్తున్నారు. ఈ ప్రయాణంలో శేష్‌కు మంచి ఫ్యాన్ బేస్ ఏర్పడింది.
ప్రస్తుతం అడివి శేష్ రెండు క్రేజీ ప్రాజెక్ట్స్‌తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఒకటి గూఢచారి 2, మరొకటి డెకాయిట్. ఈ రెండింటిపైనా మంచి అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా డెకాయిట్ ఒక హై యాంటిసిపేటెడ్ పాన్ ఇండియా థ్రిల్లర్‌గా రూపొందుతోంది.
ఈ చిత్రానికి షానియల్ డియో దర్శకత్వం వహిస్తున్నారు. ఎస్‌ఎస్ క్రియేషన్స్, సునీల్ నారంగ్ ప్రొడక్షన్స్ సంస్థలు దీనిని నిర్మిస్తున్నాయి. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో సుప్రియ యార్లగడ్డ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మృణాల్ ఠాకూర్ కథానాయికగా నటిస్తున్నారు. ఇటీవలే ఆమె ఫస్ట్ లుక్, గ్లింప్స్‌ను రిలీజ్ చేశారు.
తొలుత ఈ చిత్రానికి శ్రుతి హాసన్ హీరోయిన్‌గా ఎంపిక అయ్యారు. టైటిల్ వీడియో కూడా ఆమెతో రిలీజ్ చేశారు. కానీ కొన్ని రోజుల షూటింగ్ తర్వాత శ్రుతి ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారు. దీనిపై సోషల్ మీడియాలో రకరకాల రూమర్లు చక్కర్లు కొట్టాయి. తాజాగా ఈ విషయంపై అడివి శేష్ క్లారిటీ ఇచ్చారు.
“శ్రుతి తప్పుకోవడంలో ఎలాంటి డ్రామా లేదు. ఆమె ‘కూలీ’ సినిమా షూటింగ్‌లతో బిజీగా ఉండటం, వర్కింగ్ స్టైల్‌లో తేడాలు ఉండటం వల్ల ఫ్రెండ్లీగా విడిపోయాం. ఎలాంటి గొడవలు లేవు” అని తెలిపారు. దీంతో శేష్ వస్తున్న రూమర్లకు చెక్ పెట్టారు.
అలాగే, డెకాయిట్ సినిమా ఇప్పటికే 60% షూటింగ్ పూర్తిచేసుకుందని, టీమ్ తెలుగు-హిందీ భాషల వర్షన్స్‌లో క్రెడిబిలిటీ ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటోందని తెలిపారు. కొన్ని సీన్లు రెండు భాషల్లో వేర్వేరు నటులతో షూట్ చేస్తున్నట్టు చెప్పారు. ఈ సినిమాను క్రిస్మస్ కానుకగా విడుదల చేయబోతున్నట్టు స్పష్టం చేశారు.
Recent Random Post:














