
టాలీవుడ్ ప్రేక్షకులను మెస్మరైజ్ చేసిన హీరోయిన్లలో చందమామ కాజల్ అగర్వాల్ ఒకరు. స్క్రీన్ పై తన గ్లామర్‌తో పాటు, మాస్ డాన్స్‌లతో తెలుగు ఆడియన్స్ గుండెల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. సినిమాలతో పాటు వెబ్‌సిరీస్‌లు, స్పెషల్ సాంగ్స్ చేస్తూ తనదైన గుర్తింపు తెచ్చుకున్న కాజల్ పాన్ ఇండియన్ హీరోయిన్గా పేరు తెచ్చుకుంది. తెలుగు, తమిళ పరిశ్రమల్లో అనేక హిట్ చిత్రాల్లో నటించి స్టార్ హోదా అందుకుంది.
ప్రారంభంలో గ్లామర్ పాత్రలతో కెరీర్ మొదలుపెట్టిన కాజల్, తరువాత మగధీర, చందమామ వంటి చిత్రాల్లో మంచి పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. అయితే ఆ తర్వాత తమిళ సినిమాల్లో ఎక్కువగా గ్లామర్ షోకే పరిమితమైంది. మధ్యలో కొన్ని లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేసినా, అవి ఆశించిన స్థాయిలో విజయాన్ని అందించలేకపోయాయి. 2020లో గౌతమ్ కిచ్లును వివాహం చేసుకుని కొంతకాలం సినిమాలకు విరామం ఇచ్చిన కాజల్, తల్లి అయిన తర్వాత మళ్లీ ఇండస్ట్రీకి రీఎంట్రీ ఇచ్చింది.
ప్రస్తుతం కమల్ హాసన్ నటిస్తున్న ఇండియన్ 3లో కీలక పాత్ర పోషిస్తోంది. అలాగే మంచు విష్ణు నిర్మిస్తున్న డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్పలో పార్వతీ దేవిగా కనిపించనుంది. ప్రస్తుతం ఇవే ప్రాజెక్టులు ఉన్నా, కొత్త ఆఫర్లు మాత్రం పెద్దగా లేవు. ఒకవైపు కమర్షియల్ యాడ్స్ చేస్తూ, మరోవైపు సొంత బిజినెస్‌లలో కూడా బిజీగా ఉంది కాజల్.
అయితే సినిమాల పరంగా అవకాశాలు తగ్గిన నేపథ్యంలో మళ్లీ కెరీర్‌ను నిలబెట్టుకోవాలనే ఉద్దేశంతో కాజల్ కొత్త ప్లాన్ వేస్తోందట. తన దర్శకత్వంలో ఓ సినిమా చేయాలని నిర్ణయించుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. బాలీవుడ్లో కమర్షియల్ అంశాలతో ఓ సినిమాను రూపొందించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే స్టార్ హోదా అనుభవించిన కాజల్, ఇప్పుడు డైరెక్టర్‌గా మారి ఇలాంటి పెద్ద రిస్క్ ఎందుకని ఆమె అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాజల్ మనసులో నిజంగా ఏముందో తెలియాలంటే ఇంకా వేచి చూడాల్సిందే.
Recent Random Post:















