తండ్రి 16ఏళ్ల కల నిజం చేసిన రామ్ చరణ్..!

గ్లోబల్ స్టార్ గా మారి మెగా బ్రాండ్ ని రెట్టింపు చేసిన రామ్ చరణ్ తాజాగా మరోసారి తన తండ్రి మెగాస్టార్ ని గర్వపడేలా చేశాడు. తాజాగా RRR మూవీకి సంబంధించిన రామ్ చరణ్ కటౌట్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లో ప్రదర్శించబడింది. ఈ అరుదైన ఘనతతో మరోసారి చరణ్ తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు. మెగాస్టార్ వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్ పలు విజయవంతమైన సినిమాలతో తన తండ్రి స్టార్ డమ్ కి నిజమైన వారసుడయ్యాడు.

ఇక తాజాగా తన కోరికను నెరవేర్చినందుకు కొడుకు పట్ల చిరు ఎంతో గర్విస్తున్నారు. RRR సినిమాలో అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్ చరణ్ తన నటనతో ప్రేక్షకుల్ని ఆకట్టుకుని అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు తన తండ్రి 16ఏళ్ల కలను నిజం చేశాడు చరణ్. 2007లో తెలుగు చిత్ర పరిశ్రమ 75 ఏళ్ల వేడుకయిన వజ్రోత్సవం వేదికపై చిరంజీవి ప్రసంగిస్తూ భావోద్వేగానికి లోనయ్యారు. ‘

నేను గోవా ఫిలిం ఫెస్టివల్ కి వెళ్ళినప్పుడు అక్కడ తెలుగు నటీ నటులు అయిన ఎస్వీఆర్, ఎన్టీఆర్, ఏఎన్నార్ ల ఫోటోలు చూడలేదని, తెలుగు కళాకారులకు తగిన గౌరవం లభించడం లేదని’ చిరంజీవి వ్యాఖ్యానించారు. కట్ చేస్తే, మళ్లీ ఇన్నేళ్ల తర్వాత గోవా ఫిలిం ఫెస్టివల్లో తెలుగు హీరో ఫోటో కనిపించింది. అది కూడా మెగాస్టార్ వారసుడైన రామ్ చరణ్ ఫోటో కనిపించడం విశేషం.

ఈ సంవత్సరం 54వ అంతర్జాతీయ చలనచిత్రంలో RRR నుండి అల్లూరి సీతారామరాజు గెటప్ లో రామ్ చరణ్ ఉన్న ఫోటో కనిపించింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. గోవా ఫిలిం ఫెస్టివల్ ఎంట్రీ గేటు వద్ద రామ్ చరణ్ మరియు అనుష్క ఫోటోలు కనిపించాయి. దీంతో మెగా ఫ్యాన్స్ రామ్ చరణ్ ఫోటో ని చూసి ఎంతో ఆనందించారు.

ఆ ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ‘తండ్రి కలం నిజం చేసిన కొడుకు’ అని కామెంట్స్ చేస్తున్నారు. కాగా 53వ ఫిలిం ఫెస్టివల్ లో గత ఏడాది ‘ఇండియన్ ఫిలిం పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్’ అవార్డును మెగాస్టార్ చిరంజీవి అందుకున్న విషయం తెలిసిందే. ఇక ఈ ఏడాది ఫిలిం ఫెస్టివల్ లో తెలుగు నుంచి ఎవరికి అవార్డు వరిస్తుందో చూడాలి.


Recent Random Post: