
సినీ స్టార్లు సినిమాల్లో నటిస్తూ కోట్లలో పారితోషికాలు అందుకుంటూనే, సైడ్ బిజినెస్‌ల ద్వారా కూడా భారీ ఆదాయం సంపాదిస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా కమర్షియల్ యాడ్స్ ద్వారా స్టార్ హీరోలు, హీరోయిన్లు అదనపు రెవెన్యూ పొందుతున్నారు. తమ క్రేజ్‌తో ప్రముఖ బ్రాండ్లకు ప్రచారం చేస్తూ ఆ కంపెనీల సేల్స్‌ను పెంచడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు స్టార్ హీరోలు, హీరోయిన్లు మాత్రమే కాదు, ప్రకాశ్ రాజ్, సోనూసూద్ లాంటి క్యారెక్టర్ ఆర్టిస్టులు కూడా బ్రాండ్ అంబాసిడర్లుగా రాణిస్తున్నారు.
తెలుగులో రామ్ చరణ్ నుంచి నాని వరకు, పూజా హెగ్డే నుంచి అనుపమ పరమేశ్వరన్ వరకు అనేకమంది ప్రముఖ బ్రాండ్లకు ప్రచారకర్తలుగా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో కొందరు వివాదాలు ఎదుర్కొంటుంటే, మరికొందరు ప్రశాంతంగా తమ పని చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఇదే జాబితాలో ఇప్పుడు మిల్క్ బ్యూటీ తమన్నా కూడా మరింత బలంగా స్థానం సంపాదించింది. జపనీస్ కాస్మెటిక్ బ్రాండ్ల నుంచి ఫాంటా వరకు పది పైగా ప్రముఖ బ్రాండ్లకు ఇప్పటికే ఆమె ప్రచారం చేస్తోంది.
తాజాగా ఆమె ఖాతాలో మరో ప్రతిష్టాత్మక బ్రాండ్ చేరింది. అదే ‘మైసూర్ సాండల్ సోప్’. దశాబ్దాలుగా ప్రజల విశ్వాసాన్ని గెలుచుకుని, ఇప్పటికీ రికార్డు స్థాయిలో అమ్మకాలు సాధిస్తున్న ఈ బ్రాండ్‌కు తమన్నా బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంపిక కావడం విశేషం. కర్ణాటక ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ ప్రతిష్టాత్మక ఉత్పత్తికి ఆమెను ఎంపిక చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
అయితే ఈ నిర్ణయంపై కర్ణాటకలో కొంతమంది నిరసనలు వ్యక్తం చేశారు. స్థానిక వ్యక్తిని కాకుండా ఇతర ప్రాంతానికి చెందిన నటిని ఎలా బ్రాండ్ అంబాసిడర్‌గా నియమిస్తారంటూ విమర్శలు వినిపించాయి. ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కొందరు ప్రభుత్వాన్ని కోరారు. అయినప్పటికీ ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకోకుండా తమన్నాతో అధికారికంగా ఒప్పందం కుదుర్చుకోవడం గమనార్హం.
ఇదిలా ఉంటే, ప్రస్తుతం తమన్నా బాలీవుడ్లో వరుస క్రేజీ ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉంది. షాహిద్ కపూర్‌తో కలిసి ‘ఓ రోమియో’ సినిమాలో నటిస్తోంది. అలాగే ‘మరియా ఐపీఎస్’, వి. శాంతారామ్ బయోపిక్, సిద్దార్థ్ మల్హోత్రా ‘వీవాన్’, ‘రేంజర్’ వంటి ప్రాజెక్ట్‌లలో కూడా ఆమె భాగమైంది. విశాల్ భరద్వాజ్ దర్శకత్వంలో రూపొందుతున్న రొమాంటిక్ యాక్షన్ డ్రామా ‘ఓ రోమియో’లో మాత్రం ఎలాంటి పారితోషికం తీసుకోకుండా నటించడం విశేషంగా చెప్పుకోవాలి.
Recent Random Post:















