
పదేళ్ల కెరీర్లో కేవలం మూడు సినిమాలే తెరకెక్కించిన యువ దర్శకుడు తరుణ్ భాస్కర్ ఈ మూడు చిత్రాలతోనే యూత్‌లో సూపర్ క్రేజ్ సంపాదించుకున్నాడు. విజయ్ దేవరకొండతో పెళ్లిచూపులు ద్వారా దర్శకుడిగా మారిన తరుణ్, ఆ తర్వాత ఈ నగరానికి ఏమైందితో మరో హిట్ అందుకున్నాడు. మధ్యలో రైటర్‌గా కొన్ని సినిమాలకు స్క్రిప్ట్ అందించిన అతను, రెండేళ్ల క్రితం కీడా కోలా సినిమాతో ప్రేక్షకులను మరోసారి అలరించాడు. ఇదిలా ఉండగా, ఇటీవల తరుణ్ యాక్టర్‌గా కూడా బిజీగా మారాడు.
తరుణ్ భాస్కర్ నెక్ట్స్ డైరెక్టోరియల్ ప్రాజెక్ట్ ఏదీ అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కీడా కోలా విడుదలై రెండేళ్లు గడిచినా, ఆయన కొత్త ప్రాజెక్ట్‌పై ఇప్పటి వరకు ఎలాంటి క్లారిటీ లేదు. ఈ నగరానికి ఏమైంది 2 సీక్వెల్ ప్లాన్ చేస్తున్నాడని వార్తలు వచ్చినా, దానిపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. సినిమాల అప్డేట్స్ ఇవ్వకపోయినా, తరుణ్ ఇతర విషయాల్లో మాత్రం యాక్టివ్‌గా ఉంటున్నాడు.
తాజాగా, తన గ్యాంగ్‌కు మటన్ వండుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. తరుణ్ సినిమాల్లో నటించే జీవన్ ఈ వీడియోను షేర్ చేస్తూ, కుక్కర్లో మటన్ వండుతున్న తరుణ్ భాస్కర్‌ను చూపించాడు. దీనిపై అభిమానులు రియాక్ట్ అవుతూ, “మటన్ కాదు, మాకు మంచి సినిమా ఎప్పుడిస్తావ్?” అంటూ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.
తరుణ్ ప్రస్తుతం డైరెక్షన్ కన్నా యాక్టింగ్‌నే ఎక్కువగా ఎంచుకుంటున్నట్లు తెలుస్తోంది. మంచి అవకాశాలు రావడంతో సినిమా డైరెక్ట్ చేసే టైమ్ దొరకడం లేదు. తాజా సమాచారం ప్రకారం, సంతాన ప్రాప్తిరస్తు అనే సినిమాలో అతను కీలక పాత్రలో నటిస్తున్నాడు. యాక్టింగ్ వల్ల తన రైటింగ్‌పై దృష్టి పెట్టలేకపోతున్నాడని సినీ వర్గాలు చెబుతున్నాయి.
అభిమానులు పెళ్లిచూపులు 2 లేదా ఈ నగరానికి ఏమైంది 2 కోసం ఎదురుచూస్తున్నా, తరుణ్ మాత్రం ప్రస్తుతం నటనతో బిజీ అయ్యాడు. చివరిగా కీడా కోలాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆయన, మళ్లీ డైరెక్షన్‌కు ఎప్పుడు వస్తాడో చూడాలి!
Recent Random Post:















