తాత 3 సార్లు ఎమ్మెల్యే..అందుకే కంగ‌న!

బాలీవుడ్ క్వీన్ కంగ‌నా ర‌నౌత్ ఇటీవ‌ల జ‌రిగిన ఎన్నిక‌ల్లో బీజేపీ త‌రుపు ఎంపీగా గెలిచిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌త్య‌క్ష ఎన్నిక‌ల్లో బ‌రిలో మొట్ట మొద‌టి సారే జ‌య‌కేత‌నం ఎగ‌రేసి స‌త్తా చాటింది. దీంతో కంగ‌న‌కి సినిమా ల్లోనూ తిరుగులేదు..రాజ‌కీయాల్లోనూ ఎదురు లేదంటూ దూసుకొచ్చింది. ఇప్పుడు మండి నియోజ‌క వ‌ర్గాన్ని అభివృద్ధి ప‌థంలో న‌డిపించాల్సిన బ‌రువైన బాధ్య‌త ఆమె పై ఉంది. పార్టీ న‌మ్మి టికెట్ ఇచ్చింది.

ప్రజ‌లు సైతం అంతే న‌మ్మ‌కంతో ఆమెని గెలిపించి గొప్ప ప‌ద‌విని, గౌర‌వాన్ని క‌ట్ట‌బెట్టారు. ఎలాంటి రాజ‌కీయం వార‌సత్వం లేకుండానే కంగ‌న ఎన్నిక‌ల్లో స‌త్తా చాటింద‌ని అంతా అనుకుంటోన్న త‌రుణం ఇది. కేవ‌లం న‌టిగా దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుని…డ‌బ్బు సంపాదించిన త‌ర్వాత రాజ‌కీయాల్లోకి వెళ్లి నిల‌బ‌డింద‌ని అంతా భావిస్తున్నారు. కానీ కంగ‌న‌కి రాజ‌కీయ వార‌సత్వం ఉంద‌న్న సంగ‌తి ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది.


Recent Random Post: