తారక్..యశ్ మేధో మథనం!

యంగ్ టైగర్ ఎన్టీర్…రాకిగ్ స్టార్ యశ్ ఒకే రకమైన ఫేజ్ లో ఉన్నారా? ఇద్దరికి ఒత్తిడి తప్పడం లేదా? పాన్ ఇండియా ఇమేజ్ ఇద్దర్నీ కన్ప్యూజన్ కి గురి చేస్తుందా? నిర్ణయాలు తీసుకోవడంలో జాప్యం వెనుక అసలు కారణాలు ఇవేనా? అంటే అవుననే టాక్ వినిపిస్తుంది. ఆర్ ఆర్ ఆర్ సెట్స్ లో ఉంగానే తారక్ 30వ చిత్రాన్ని కొరటాల శివ దర్శకత్వంలో లాక్ చేసారు.

కానీ ఆటుపై ఆచార్య పరాభవంతో టైగర్ డైలమాలో పడ్డాడు. కొరటాల ఉన్న పరిస్థితుల్లో ఇప్పుడతనితో సినిమా కరెక్టెనా? అన్న మీమాంస మొదలైంది. అక్కడ నుంచి 30వ సినిమా విషయంలో రకరకాల కథనాలు వెలువుడుతోన్న వైనం కళ్ల ముందు కనిపిస్తూనే ఉంది. కథ విషయంలో మార్పులు చేర్పులు..అవి తారక్ కి నచ్చకపోవడం.. అతను కొన్ని రకాల సలహాలు ఇవ్వడం ఇలా ఎన్నో సందేహాలు తెరపైకి వచ్చాయి.

వీటిపై ఎప్పటికప్పుడు మీడియా కథనాలు అంకంతకు హీటెక్కిస్తున్నాయి. చివరికి తారక్ కొరటాల స్థానంలో కొత్త దర్శకుడ్ని తీసుకొచ్చినా? ఆశ్యర్యపోనవసరం లేదు ! అన్నంతగా కథనాలు ప్రభావితం చేస్తున్నాయి. ఈ విషయంపై ఇప్పటికీ క్లారిటీ లేదు. అటు తారక్ గానీ..ఇటు కొరటాల గానీ క్లారిటీ ఇవ్వడంలో ఆలస్యం రూపంలో వైఫల్యం కనిపిస్తుంది.

అభిమానులు ఎంతగా గగ్గోలు పెడుతున్నా? టైగర్ మాత్రం నోరు మెదడపడం లేదు. ఇక కన్నడ రాకింగ్ స్టార్ యశ్ కి కేజీఎఫ్ తో వచ్చిన పాన్ ఇండియా సక్సెస్ తో దాదాపు తారక్ డైలమాకి సమీపంగానే కనిపిస్తున్నాడు. ఇంత వరకూ కొత్త ప్రాజెక్ట్ ప్రకటించింది లేదు. తనని మళ్లీ పాన్ ఇండియాలో చూపించే దర్శకుడు ఎవరు? అని వెతుకుతున్నా చిక్కడం లేదు.

కన్నడ మేకర్స్ పక్కనెబెట్టి తమిళ్..టాలీవుడ్ మేకర్స్ వైపు చూసినా కుదరడం లేదు. సక్సెస్ లున్న దర్శకులంతా బిజీగా ఉన్నారు. అలాగని కొత్త వాళ్లని నమ్మి ముందుకెళ్లలేని పరిస్థితి. ఈ క్రమంలో అభిమానుల నుంచి తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కోవాల్సి వస్తుంది. మరోవైపు వందల కోట్లు పెట్టుబడి పెట్టడానికి నిర్మాణ సంస్థలు పోటీ పడుతున్నాయి.

కానీ దర్శకుడి విషయంలో తర్జన భర్జన కనినపిస్తుంది. ఆ రకంగా యశ్..తారక్ ఒక రకమైన ఫేజ్ లో ఉన్నట్లు కనిపిస్తుంది. మరి ఈ సస్పెన్స్ కి స్టార్ హీరోలిద్దరు ఎప్పుడు పుల్ స్టాప్ పెడతారో చూడాలి. ప్రస్తుతం ఇద్దరు ఫ్యామిలీకి సమయాన్ని కేటాయిస్తున్నారు.


Recent Random Post: