రాజమౌళి తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీలో బాక్సాఫీస్ వద్ద బలమైన పట్టు సాధించిన దర్శకులలో త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒకరు. అయితే ఆయన కంటే తక్కువ రేంజ్ లో ఉన్న దర్శకులు కూడా ప్రస్తుతం పాన్ ఇండియా రేంజ్ లో సినిమాలు చేస్తున్నారు. కానీ టాలీవుడ్ ఇండస్ట్రీకి ఒక రాజ్ కుమార్ హిరని లాంటి బ్రాండ్ ఇమేజ్ సంపాదించుకున్న త్రివిక్రమ్ మాత్రం ఇంకా టాలీవుడ్ డోర్స్ దాటి బయటికి వెళ్లడం లేదు.
అయితే ఈ దర్శకుడిని పాన్ ఇండియా రేంజ్ లో నిలబెట్టాలని అల్లు అర్జున్ ఎప్పుడో ఫిక్స్ అయ్యాడు. పుష్ప సినిమాతో ఎలాగైతే సుకుమార్ ను మరో రేంజ్ కు తీసుకు వెళ్ళాడో ఇప్పుడు త్రివిక్రమ్ ను కూడా అదే దారిలో నడిపించడానికి బన్నీ దారులు సిద్ధం చేస్తున్నాడు. పుష్ప సినిమా గ్రాండ్ సక్సెస్ కావడంతో అల్లు అర్జున్ పుష్ప 2 తర్వాత సినిమాలు కూడా అదే రేంజ్ లో ఉండాలి అని ఫిక్స్ అయ్యాడు.
అయితే కేవలం రాజమౌళి లాంటి దర్శకుడిని కాకుండా డిఫరెంట్ గా వేరే దర్శకులతో బన్నీ ఆ ప్రయోగాలు చేస్తూ ఉండడం విశేషం. ఇక సుకుమార్ పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ త్రివిక్రమ్ సినిమాను స్టార్ట్ చేయాలి అని ఆలోచనతో ఉన్నాడు. ఈ కాంబినేషన్ పై ఎప్పుడో క్లారిటీ కూడా ఇచ్చేశారు. అయితే స్క్రిప్ట్ ఎలా ఉండబోతుంది అనే విషయంలో ఇదివరకే కొన్ని గాసిప్స్ వచ్చాయి.
మళ్లీ మరొక కొత్త టాక్ వైరల్ గా మారింది. వీరి కాంబినేషన్లో రాబోయే సినిమా స్వాతంత్ర ఉద్యమం నేపథ్యంలో ఉండబోతున్నట్లుగా తెలుస్తోంది. స్వాతంత్రం రాకముందే కొన్ని అంశాలను అందులో హైలెట్ చేయబోతున్నట్లు సమాచారం. ఇక భారీ సెట్స్ మధ్యలో పాన్ ఇండియా రేంజ్ కు తగ్గట్టుగా 300 కోట్ల బడ్జెట్ తో సినిమాను రూపొందించే అవకాశం ఉందట.
త్రివిక్రమ్ అనుబంధ సంస్థ హారిక హాసిని ప్రొడక్షన్ లోనే ఈ సినిమా ఉండబోతుందని సమాచారం. అలాగే గీత ఆర్ట్స్ కూడా నిర్మాణ భాగంలో సహకారం అందించవచ్చుగా తెలుస్తోంది. ఇక ఈ ప్రాజెక్టును త్రివిక్రమ్ 2024 చివరలో స్టార్ట్ చేసే అవకాశం ఉంది.
Recent Random Post: