త్రిష పెళ్లి గుసగుసలు – ఫోటో వైరల్!

Share


త్రిష సౌత్‌లో తన సత్తా చాటుతూ, నలభై ఏళ్ల వయస్సులో కూడా వరుస సినిమాలతో బిజీగా కొనసాగుతోంది. తాజాగా ఆమె షేర్ చేసిన ఓ ఫోటో సోషల్ మీడియాలో దూసుకుపోతోంది. త్రిష ఓ పార్టీలో దిగిన ఫోటోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయగా, అందులో రమ్యకృష్ణ, జ్యోతిక, రాధికా శరత్‌కుమార్ వంటి سینియర్ నటి మిత్రులు కూడా ఉన్నారు.

ఈ ఫోటోను చూసిన ఫ్యాన్స్ మాత్రం ఇది సాధారణ గెట్-టు-గెదర్ కాదని, బ్యాచిలర్ పార్టీ అయి ఉండొచ్చని, లేక పెళ్లికి సంబంధించి ఏదైనా వేడుక అయి ఉండొచ్చని ఊహాగానాలు పెంచుతున్నారు. త్రిష పెళ్లిపై ఎప్పుడూ ఆసక్తి చూపించే అభిమానులకు ఈ ఫోటో మరింత కుతూహలం రేకెత్తిస్తోంది.

ఇప్పటికే గతంలో కూడా త్రిష పెళ్లికూతురి గెటప్‌లో కనిపించి సోషల్ మీడియాను షేక్ చేసింది. అప్పటి నుంచి ఆమె పెళ్లి వార్తలపై మరింత ఆసక్తి పెరిగింది. పొన్నియన్ సెల్వన్ సినిమా తర్వాత మంచి ఫామ్‌లోకి వచ్చిన త్రిషకు వరుసగా భారీ ఆఫర్లు వస్తున్నాయి.

ప్రస్తుతం త్రిష మెగాస్టార్ చిరంజీవితో విశ్వంభర, అజిత్‌తో గుడ్ బ్యాడ్ అగ్లీ, అలాగే కమల్ హాసన్‌తో థగ్ లైఫ్ సినిమాల్లో నటిస్తోంది. వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఆమె ఇప్పుడు పెళ్లి చేసుకునే ఆలోచనలో ఉందా? లేక చేతిలో ఉన్న ప్రాజెక్ట్స్ పూర్తి చేసిన తర్వాతే పెళ్లిపై నిర్ణయం తీసుకుంటుందా? అనే దానిపై క్లారిటీ రావాల్సి ఉంది.

అయితే, అభిమానులు మాత్రం త్రిష నుంచి ఎప్పుడైనా సడెన్‌గా సర్‌ప్రైజ్ రావొచ్చని అంచనా వేస్తున్నారు. త్రిష ఈ ఊహాగానాలకు తెర దించే రోజు ఎప్పుడొస్తుందో చూడాలి!


Recent Random Post: