నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ ఇంట విషాద ఛాయలు అలముకున్నాయి. ఆయన కూతురు గాయత్రి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. గాయత్రి మృతి ఒక్క రాజేంద్ర ప్రసాద్ కే కాదు తెలుగు సినీ పరిశ్రమను తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యేలా చేసింది. సినీ ప్రముఖులు రాజేంద్ర ప్రసాద్ కు తమ సానుభూతిని అందిస్తున్నారు. ఐతే ఈ టైం లో రాజేంద్ర ప్రసాద్ తన కూతురిని దూరం పెట్టిన విషయం తెలిసిందే. ప్రేమ వివాహం చేసుకుందని కొన్నాళ్లు కూతురిని దూరం పెట్టారు.
ఐతే 2018లో బేవార్స్ అనే సినిమాలో నటించారు రాజేంద్ర ప్రసాద్. ఆ సినిమాను రమేష్ చెప్పాల డైరెక్ట్ చేశారు. ఆ సినిమాలో కథ ప్రకారం కూతురు చనిపోతే తల్లి నా చిట్టి తలి అంటూ సాగే ఒక విషాద గీతం ఉంది. సుద్దాల అశోక్ తేజ ఆ పాటను రాశారు.ఆ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రాజేంద్ర ప్రసాద్ ఈ పాతలో నటించాక తన కూతురు గాయత్రిని ఇంటికి పిలిపించి వినిపించానని.. ఇద్దరం బాధపడి దగ్గరయ్యామని చెప్పారు. అప్పటి నుంచి గాయత్రి రాజేంద్ర ప్రసాద్ దగ్గరకు వస్తూ ఉంది.
ఐతే సినిమాలో అలాంటి పాట ఒకటి వస్తేనే తట్టుకోలేకపోయిన రాజేంద్ర ప్రసాద్ ఇప్పుడు నిజ జీవితంలో కూతురు ఇక లేదని తెలిసి తల్లడిల్లిపోతున్నారు. ఆ పాట షూటింగ్ టైం లో తన తల్లి చనిపోయినప్పుడు కూడా ఏడవలేదు కానీ కూతురు లేదని అంటే తట్టుకోలేకపోయా అని చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఆయన పరిస్థితి తలచుకుంటేనే చాలా బాధగా ఉంది. ఐతే అప్పుడు బేవార్స్ సినిమా తీసిన రమేష్ చెప్పాల డైరెక్షన్ లోనే రాజేంద్ర ప్రసాద్ ఇప్పుడు లగ్గం అనే సినిమా చేస్తున్నారు.
రాజేంద్ర ప్రసాద్ కు దేవుడు ఈ టైం లో కాస్త బలం ఇవ్వాలని.. ఆయనకు ఎమోషనల్ సపోర్ట్ గా ఉంది సినీ పరిశ్రమ. ఒకప్పుడు హీరోగా నటించి ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేస్తూ వస్తున్నారు రాజేంద్ర ప్రసాద్. ఆయన కామెడీ టైమింగ్, వర్సటాలిటీ గురించి అందరికీ తెలిసిందే. అందరినీ నవ్వించే ఆయన ఈరోజు దుఖం తో నిండిపోవడం అందరినీ బాధిస్తుంది.
Recent Random Post: