
‘దేవర’ తర్వాత కొరటాల శివ ఏ సినిమా చేస్తారో అనే విషయంపై ఇటీవల సందేహాలు చెలరేగాయి. కానీ తాజా సమాచారం ప్రకారం, ఆయన తరువాత సినిమా ‘దేవర 2’నే. కొరటాల ఎప్పటికీ ‘దేవర’ మరియు ‘దేవర 2’ ప్రాజెక్టుల్ని కలిపే ఒక సిరీస్‌గానే చూశారు. మద్యలో ఇంకొక సినిమా ఉంటుందన్నది కేవలం అభిమానుల ఊహాగానమే.
ఇక ‘దేవర’కి మిశ్రమ స్పందన వచ్చిన నేపథ్యంలో ‘దేవర 2’ ఉండదని ప్రచారం సాగింది. కానీ ఎన్టీఆర్ స్వయంగా ఈ ఊహాగానాలకు పుల్‌స్టాప్ పెట్టారు. ‘డ్రాగన్’ తర్వాత ‘దేవర 2’నే చేస్తానని స్పష్టంగా చెప్పారు. దీంతో ఈ ప్రాజెక్టుపై ఎలాంటి అయోమయం ఉండదని తేలిపోయింది.
ఇప్పటికే కొరటాల స్క్రిప్ట్‌ను రెడీ చేసి, దానికి తుది మెరుగులు దిద్దుతున్నట్టు తెలుస్తోంది. ‘దేవర 2’లో మొదటి భాగానికి వచ్చిన విమర్శలకు సమాధానం ఉండేలా కథను డిజైన్ చేస్తున్నారట. ఇకపై ఈ సినిమా ఎప్పుడు సెట్స్‌పైకి వెళ్తుందన్నదే ప్రశ్న.
‘డ్రాగన్’ సినిమా వచ్చే ఏడాది మధ్యలో విడుదలయ్యే అవకాశం ఉంది. అలా జరిగితే డిసెంబర్ నుంచి ఎన్టీఆర్ ‘దేవర 2’ కోసం డేట్లు కేటాయించనున్నారని వార్తలొస్తున్నాయి. అందుకే కొరటాల శివ కూడా మరో హీరోతో కొత్త ప్రాజెక్ట్ ప్రయత్నం చేయకుండా, పూర్తి స్థాయిలో ‘దేవర 2’పై దృష్టి సారించారు.
Recent Random Post:














