
మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్లో రూపొందబోయే మాస్ ఎంటర్టైనర్ కోసం హీరోయిన్ ఎంపిక ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది. ఇప్పటికే పలువురు నటీమణులతో చర్చలు జరిగినప్పటికీ, తాజా టాక్ ప్రకారం నయనతార పేరు ముందంజలో ఉందట. అయితే ఆమె రెమ్యూనరేషన్ డిమాండ్ ఎక్కువగా ఉండటంతో, ప్రాజెక్ట్ తాత్కాలికంగా హోల్డ్‌లో పెట్టినట్టు ఫిలింనగర్ సమాచారం.
అనిల్ రావిపూడికి ఆలస్యం చేసే వీలు లేదు. ఎందుకంటే ఈ చిత్రం 2026 సంక్రాంతికి విడుదల కావాలి. ఈ డెడ్‌లైన్ దృష్టిలో ఉంచుకుని మే మినహాయించి కేవలం ఏడునెలల వ్యవధిలో స్క్రిప్ట్ ఫైనల్ చేయడం, షూటింగ్ పూర్తి చేయడం, పోస్ట్ ప్రొడక్షన్ మొత్తం ముగించడం వంటి బాధ్యతలు ఉన్నాయి. మధ్యలో “విశ్వంభర” విడుదల, ప్రమోషన్స్, ఈవెంట్స్ వంటి కార్యక్రమాలు కూడా ఉండటంతో టైమ్ ఒత్తిడిలోనే ఉంటుంది.
నయనతార ఈ సినిమాకు ఓకే అంటే, ఇది ఆమె చిరంజీవితో మూడవ సినిమా అవుతుంది. మొదటిది సైరా నరసింహారెడ్డి – ఇందులో ఆమె చేసిన భార్య పాత్రకు పెద్దగా గుర్తింపు రాలేదు. రెండోది గాడ్ ఫాదర్ – ఇందులో చెల్లెలుగా బాగా నటించినా, సినిమా కంటెంట్ పరంగా చాలా చోట్ల బలహీనంగా నిలిచింది. ఈ సారి అయితే హ్యాట్రిక్ కాకుండా సూపర్ హిట్ కావాలి అనేది అభిమానుల ఆకాంక్ష.
ఇంకా అధికారిక ప్రకటన రాకపోయినా, నయనతార కాకపోతే మరో హీరోయిన్ పేరును కూడా పరిశీలిస్తున్నారట. గతంలో మృణాల్ ఠాకూర్ పేరు వినిపించినా, అది నిరాకరించబడింది. మరో కీలక పాత్ర కోసం మరో హీరోయిన్ ఎంపిక కూడా ఉంటుందన్న వార్తలున్నాయి, కానీ క్లారిటీ లేదు.
ప్రస్తుతం అనిల్ రావిపూడి స్క్రిప్ట్ లాక్ చేసి, లొకేషన్ల ఎంపిక, క్యాస్టింగ్ పనుల్లో బిజీగా ఉన్నాడు. వేసవిలో షూటింగ్ ప్రారంభించాలన్న యోజనతో ముందుకు వెళ్తున్నాడు. “విశ్వంభర”కు ఇంకా ఒక పాట, డబ్బింగ్ పనులు పెండింగ్‌లో ఉండగా, వచ్చే సంక్రాంతికి సినిమా పూర్తయ్యేలా ప్లాన్ చేస్తున్నాడు. ముఖ్యంగా అభిమానులు ఆశించే వింటేజ్ చిరంజీవిని చూపించాల్సిన బాధ్యత అనిల్‌పై ఉంది.
Recent Random Post:














