
నందమూరి బాలకృష్ణ ‘అఖండ’ సినిమాలో చెప్పిన డైలాగ్‌ను నయనతార అక్షరాలా పాటిస్తూ, అందరినీ ఆశ్చర్యంలో ముంచేస్తోంది. “మీరు చదివింది చట్టం… మేము నమ్మేది ధర్మం బోత్ ఆర్ నాట్ సేమ్” అన్న బాలకృష్ణ డైలాగ్‌ను ఫాలో అవుతూ, నయన్ కొత్త స్ట్రాటజీని ఉపయోగిస్తోంది. యావరేజ్ రేంజ్ ప్రొడక్షన్ హౌస్, భారీ ప్రొడక్షన్ హౌస్‌ల విషయంలో తన పారితోషికంలో మార్పులు చేస్తూ, ఆమె సినిమాల ఎంపికలో సొంత నియమాలు అమలు చేస్తున్నారు.
లేడీ సూపర్ స్టార్‌గా పేరు తెచ్చుకున్న నయన్, స్టార్ హీరోలకు పోటీగా క్రేజ్‌ను సొంతం చేసుకున్నారు. ఆ క్రేజ్‌కు తగిన సినిమాలే ఆమె ఎంచుకుంటోంది. లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో నటిస్తూ, అప్పుడప్పుడూ స్టార్ హీరోలతో కలిసి భారీ ప్రాజెక్ట్స్‌కు గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది. ఈ నేపథ్యంలోనే నయన్ తన పంథాను మార్చి, వ్యూహాత్మకంగా ప్రొడక్షన్ రేంజ్ మరియు సినిమా స్థాయి ఆధారంగా పారితోషికం డిమాండ్ చేస్తోంది.
ఈ ఏడాది సంక్రాంతి బరిలో విడుదలైన ‘శివ శంకర వరప్రసాద్‌గారు’ సినిమాలో చిరు జోడీగా నయన్ నటించారని తెలిసిందే. ఈ సినిమాలో ఆమె ప్రోమోషనల్ వీడియోలలో కూడా కనిపిస్తూ ప్రేక్షకులను ఆశ్చర్యంలో పెడుతోంది. ఈ సినిమాకు ఆమె రూ.6 కోట్లు పారితోషికం తీసుకుంది.
ఇవ్వరి తర్వాత రాకింగ్ స్టార్ యష్ హీరోగా ‘టాక్సిక్’ సినిమా రిలీజ్ కావడంతో, సినిమా బడ్జెట్, యష్ మార్కెట్, మరియు సినిమా స్థాయి ఆధారంగా నయన్ తన పారితోషికాన్ని రూ.12 కోట్లు వరకు డిమాండ్ చేసింది. నయన్ ఫాలో అవుతున్న ఈ కొత్త వ్యూహం ఇప్పుడు కోలీవుడ్, టాలీవుడ్ ఇండస్ట్రీలలో చర్చకు కారణమైంది. ‘టాక్సిక్’ మార్చి 19న భారీ స్థాయిలో విడుదల కాబోతోందని, అదే రోజు రణ్‌వీర్ సింగ్ ‘ధురంధర్ 2’ కూడా రిలీజ్ కావడం, ఏ సినిమా పైప్రభావం చూపుతుందో అని ప్రేక్షకుల ఆసక్తిని పెంచుతోంది.
Recent Random Post:















