నయ‌న‌తార‌-ఐశ్వ‌ర్యరాయ్ మ‌ధ్య పోటీ

నయ‌న‌తార‌తో ఐశ్వ‌ర్యారాయ్ పోటీనా? ఇది చ‌ద‌వ‌టానికి జోక్ గా ఉన్నా….మ్యాట‌ర్ లో మాత్రం చాలా సీరియ‌స్ అండోయ్. అవును..ఇద్ద‌రు ఇప్పుడు ఓ సినిమా ఛాన్స్ కోసం గట్టి ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌ట్లు తెలుస్తుంది. అదీ ఐశ్వ‌ర్యారాయ్ అభిమానించే ద‌ర్శ‌కుడు నుంచే ఈ ర‌క‌మైన పోటీని ఎదుర్కోవ‌డం ఆశ‌ర్య‌క‌ర‌మైన అంశం. వివ‌రాల్లోకి వెళ్తే…విశ్వ‌న‌టుడు క‌మ‌ల్ హాస‌న్- మ‌ణిరత్నం కాంబినేష‌న్ లో ఓ సినిమాకి రంగ‌రం సిద్ద‌మ‌వుతోన్న సంగ‌తి తెలిసిందే.

కొన్నేళ్ల త‌ర్వాత ఈ కాంబినేష‌న్ చేతులు క‌లుపుతుంది. దీంతో ఈసినిమా ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా ప్లాన్ చేస్తున్నారు. `పొన్నియ‌న్ సెల్వ‌న్` స‌క్సెస్ తో మ‌ణిసార్ మ‌ళ్లీ ఫాంలో కి వ‌చ్చేసారు. క‌మ‌ల్ హాస‌న్ క‌థ‌ల విష‌యంలో ఆచితూచి అడుగులేస్తున్నారు. ఇంత‌కు ముందు లా క‌మిట్ అవ్వ‌డం లేదు. ఈ నేప‌థ్యంలో మ‌ణిరత్నం నుంచి పిలుపు రావ‌డంతో ఆయ‌న సినిమాకి క‌మిట్ అయ్యారు. అయితే ఇందులో క‌మ‌ల్ కి జోడీగా ఏ హీరోయిన్ ని ఎంపిక చేయాలి ? అన్న అంశంపై వాడి వేడి చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయ‌ట‌.

ఈ నేప‌థ్యంలో ప్ర‌ముఖంగా న‌య‌న‌తార‌..ఐశ్వ‌ర్యారాయ్ పేర్ల‌ను ప‌రిశీలిస్తున్న‌ట్లు తెలిసింది. ఎవ‌ర్నీ ఎంపిక చేయాలి? అన్న అంశంపై క‌మ‌ల్..మ‌ణిర‌త్నం సీరియ‌స్ గా ఆలోచ‌న చేస్తున్నారుట‌. ది పెర్పార్మ‌ర్ ఎవ‌రు? ఫాంలో ఉన్న బ్యూటీ ఎవ‌రు? ఇలా అన్ని ర‌కాలుగా విశ్లేషించుకుని ఆ ఇద్ద‌రిలో ఎవ‌రో ఒకిరికి ఛాన్స్ ఇచ్చే అవ‌కాశం ఉంది. న‌య‌న‌తార ఫుల్ ఫాంలో ఉంది. కొన్నాళ్ల‌గా అమ్మ‌డికి తిరుగులేదు. ఇటీవ‌లే `జ‌వాన్` తో బాలీవుడ్ లోనూ భారీ స‌క్సెస్ ఖాతాలో వేసుకుంది.

టాలీవుడ్..కోలీవుడ్ లోనూ అమ్మ‌డు దూకుడికి తిరిగులేదు. న‌య‌న‌తార కోసమే థియేట‌ర్ కి వ‌చ్చే అభిమానులెంతో మంది ఉన్నారు. ఇక ఐశ్వ‌ర్యారాయ్ చాలా కాలంగా అవకాశాలు లేక ఖాళీగా ఉంటుంది. మ‌ణిర‌త్నం గుర‌స‌మానులు. ఆయ‌న ప్ర‌తిష్టాత్మక చిత్రాల్లో ఆస్థాన న‌టిలా పేరుగాంచింది ఐశ్వ‌ర్యారాయ్. కానీ ఇప్పుడు న‌య‌న‌తార కూడా పోటీగా ఉండ‌టంతో ఐష్ కి ఈసారి ఉద్వాస‌న త‌ప్ప‌ద‌ని వినిపిస్తుంది. ఐశ్వ‌ర్యారాయ్ రూంలో కూడా చాలా ర‌కాల మార్పులొచ్చాయి. మునుప‌టంత గ్లామ‌ర్ గా క‌నిపించ‌లేదు. ఇవ‌న్నీ ఐశ్వ‌ర్యారాయ్ కి నెగిటివ్ గా మారుతున్నాయి. మ‌రి తుదిగా మ‌ణితర్నం-క‌మ‌ల్ ప్రాజెక్ట్ లో ఎవ‌రు ఛాన్స్ ద‌క్కించుకుంటారో చూడాలి.


Recent Random Post: