నాని కొత్త ప్రాజెక్ట్‌పై ఫ్యాన్స్ ఎదురుచూపు

Share


నేచురల్ స్టార్ నాని ఇటీవల తన బ్లాక్‌బస్టర్ మూవీ హిట్: ది థర్డ్ కేస్ తో బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయి విజయాన్ని సాధించారు. శైలేష్ కొలను దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా రూ.100 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. మే 1న ఐదు భాషల్లో థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం, ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌లో కూడా అందుబాటులోకి వచ్చింది. ఓటీటీలోను టాప్ ట్రెండింగ్ లిస్ట్‌లో ఉండటం విశేషం.

అయితే, ఇంత పెద్ద విజయం తర్వాత కూడా నాని ఇప్పటివరకు ఎటువంటి పబ్లిక్ అప్డేట్ ఇవ్వకపోవడం అభిమానుల్లో చర్చనీయాంశమైంది. హిట్ 3తో రికార్డ్ హిట్ ఇచ్చిన తర్వాత, తన తదుపరి ప్రాజెక్ట్‌పై నాని ఇంకా మౌనంగా ఉండటంతో ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్నారు.

ఇకపోతే, నాని తదుపరి ప్రాజెక్ట్‌గా ది ప్యారడైజ్‌ అనే భారీ పాన్-ఇండియా మూవీ చేయబోతున్నారని, దసరా ఫేమ్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించబోతున్నారని తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే గ్లింప్స్ మార్చి 3న విడుదలయ్యాయి, వీటికి మంచి స్పందన వచ్చింది. సికింద్రాబాద్‌లోని ప్యారడైజ్ ఏరియాలో జరిగిన యథార్థ సంఘటన ఆధారంగా, తెలంగాణకు చెందిన ఓ రచయిత రాసిన పుస్తకాన్ని ఆధారంగా చేసుకొని ఈ సినిమా తెరకెక్కనుంది.

ఒక వేశ్య కొడుకు కథ చుట్టూ తిరిగే ఈ సినిమాకు సుధాకర్ చెరుకూరి నిర్మాత. గ్లింప్స్‌లోని డైలాగ్‌లు, సన్నివేశాలతో ఈ సినిమాపై అంచనాలు తారా స్థాయికి చేరుకున్నాయి. ప్రీ రిలీజ్ బిజినెస్, నాన్-థియేట్రికల్ రైట్స్ విషయంలోనూ భారీ డిమాండ్ ఏర్పడింది. అయితే ఇంకా షూటింగ్ ప్రారంభం కానందున ఫ్యాన్స్ ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు.

ఇప్పుడు ఫ్యాన్స్ నాని నుండి ఒక షూటింగ్ అప్‌డేట్ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ పై నాని ఎప్పుడైనా స్పందిస్తాడా? షూటింగ్ ఎప్పుడు మొదలవుతుంది? అనేది అందరి దృష్టి ఆకర్షిస్తోంది.


Recent Random Post: