నితిన్‌కు వరుస ఫ్లాప్స్‌… 145 కోట్లకు పైగా భారీ నష్టం!

Share


నితిన్‌ కెరీర్‌ను పరిశీలిస్తే… విజయాల కన్నా వైఫల్యాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయినా కానీ సక్సెస్ కోసం అతడు ఎప్పటికప్పుడు కొత్త ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. ఇష్క్, గుండె జారి గల్లంతయ్యిందే, భీష్మ వంటి సినిమాలతో హిట్ ట్రాక్‌లోకి వచ్చినా, ఆ తర్వాత వచ్చిన సినిమాలు అనుకున్న స్థాయిలో ఆడలేదు.

తాజాగా నితిన్ రెండు భారీ బడ్జెట్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అవే రాబిన్ హుడ్ (దర్శకుడు వెంకీ కుడుముల), తమ్ముడు (దర్శకుడు వేణు శ్రీరామ్‌). ఈ రెండు సినిమాలపై మంచి హైప్ ఉన్నా… బాక్సాఫీస్ వద్ద మాత్రం పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి.

రాబిన్ హుడ్ సినిమాకు దాదాపు రూ.70 కోట్లు ఖర్చు కాగా, తమ్ముడు చిత్రానికి రూ.75 కోట్ల వరకు ఖర్చయ్యింది. మొత్తం రెండు సినిమాలకూ కలిపి రూ.145 కోట్ల పైగా పెట్టుబడి పడినట్టు టాలీవుడ్ ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. కానీ రాబిన్ హుడ్ మొత్తం రూ.7 కోట్ల షేర్‌కు చేరుకోలేదట. ఇక రీసెంట్‌గా విడుదలైన తమ్ముడు పరిస్థితి మరింత దయనీయంగా ఉంది. ఓపెనింగ్స్ నుంచే నెగటివ్ టాక్ రావడంతో, ఈ సినిమా రూ.5 కోట్ల షేర్‌ను కూడా రాబట్టడం కష్టమేనని ట్రేడ్ అనలిస్టులు చెబుతున్నారు.

దీంతో రెండు సినిమాలూ కలిపి కేవలం రూ.11 కోట్ల రికవరీ మాత్రమే వచ్చినట్టు టాక్. దాదాపు రూ.145 కోట్ల బడ్జెట్‌పై భారీ నష్టం వచ్చినట్లు పరిశ్రమలో చర్చించుకుంటున్నారు. ఇది నితిన్ కెరీర్‌లోనే కాదు, ఓ మీడియం రేంజ్ హీరోకు వచ్చిన అతిపెద్ద నష్టంగా అభిప్రాయపడుతున్నారు ట్రేడ్ వర్గాలు.

ఈ పరాజయాలకు కారణం కంటెంట్ లోపం, బలహీనమైన స్క్రీన్‌ప్లే అని పరిశ్రమ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఇకపై నితిన్ కథల ఎంపికలో మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని అంటున్నారు సినీ విశ్లేషకులు.

ప్రస్తుతం నితిన్ ‘ఎల్లమ్మ’ అనే సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా నిర్మాణాన్ని దిల్ రాజు సేఫ్ బడ్జెట్‌తో ప్లాన్ చేస్తున్నారట. ఈ సినిమా అయినా నితిన్‌కు తిరిగి హిట్ ట్రాక్‌లోకి తీసుకురావుతుందా లేదా అనేది వేచి చూడాల్సిందే.


Recent Random Post: