నేచురల్ స్టార్ నాని తనదైన నటనతో హీరోగా మంచి గుర్తింపుని సొంతం చేసుకున్నాడు. పక్కింటి అబ్బాయిలా ఫ్యామిలీ ఆడియన్స్ ని సైతం ఆకట్టుకుని భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ని దక్కించుకున్న నాని హీరోగా తన సినీ ప్రస్థానాన్ని ప్రారంభించి 14 ఏళ్లు పూర్తవుతోంది. ఈ విషయం నమ్మబుద్ది కావడం లేదంటున్నారు ఆయన ఫ్యాన్స్. డాక్టర్ కావాలని యాక్టర్ అయిన వాళ్లు ఇండస్ట్రీలో చాలా మందే వున్నారు.. అలాగే దర్శకుడు కావాలనుకుని యాక్టర్ గా మంచి రేంజ్ కి వెళ్లిన వాళ్లూ వున్నారు.
హీరో నాని రెండవ రకానికి చెందిన వ్యక్తి. 2005లో ప్రముఖ సీనియర్ దర్శకుడు బాపు దర్శకత్వంలో శ్రీకాంత్ స్నేహ జంటగా నటించిన మూవీ ‘రాధా గోపాలం’. ఈ మూవీతో దర్శకుడు బాపు దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా నాని తన సినీ ప్రస్థానాన్ని మొదలు పెట్టాడు.
మంచి దర్శకుడిగా పేరు తెచ్చుకోవాలన్న ఆలోచనతో దర్శకత్వ శాఖలో చేరాడట. అయితే అనూహ్యంగా 2008లో ఇంద్రగంటి మోహనకృష్ణ రూపొందించిన ‘అష్టా చమ్మా’తో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు.
ఈ మూవీ భారీ విజయాన్ని అందించడంతో హీరోగా నాని ఇక వెనుతిరిగి చూసుకోలేదు. ఆ తరువాత చేసిన స్నేహితుడా రమేష్ వర్మ ‘రైడ్ ‘ భీమిలి కబడ్డీ జట్టు అలా మొదలైంది. పిల్ల జమీందర్ ఈగ నానిని తిరుగులేని హీరోగా నిలబెట్టాయి. యాక్సిడెంటల్ గా డైరెక్టర్ కాబోయి యాక్టర్ గా మారిన నాని ఈ ప్రయాణం అంత ఆశామాషీగా సాగలేదని తాను హీరోగా ఓవర్ నైట్ లోనే స్టార్ గా మారిపోలేదని ఇందు కోసం ఎంతో కష్టపడ్డానని చెప్పుకొచ్చారు.
2005లో ‘రాధాగోపాలం’ సినిమాకు దర్శకుడు బాపు గారితో కలిసి పని చేశాను. మంచి దర్శకుడిగా పేరు తెచ్చుకోవాలని ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాను. సినిమాకు సంబంధించిన ప్రతీ విషయాన్ని ఇక్కడికి వచ్చాకే తెలుసుకున్నా. కొన్ని రోజులు రేడీయో జాకీ గా పని చేశాను. ఆ తరువాత కొన్ని ప్రకటనల్లో నటించే అవకాశాలు వచ్చాయి. 2008లో విడుదలైన ‘అష్టా చమ్మా’ సినిమా ఎంతో పేరు తెచ్చిపెట్టింది. ఇదంతా ఒక్కరాత్రిలో జరగలేదు.
ఈ స్థాయికి రావడానికి ఎంతో కష్టపడ్డాను. నేను చేసే ప్రతి పనిలో నా బెస్ట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. ఇంత మంది అభిమానుల ప్రేమ ఆప్యాయత నాకు దక్కుతున్నాయంటే నిజంగా నేను అదృష్టవంతుడిని అనుకుంటున్నాను’ అన్నారు నాని. ప్రస్తుతం నాని నటిస్తున్న యాక్షన్ ఎంటర్ టైనర్ ‘దసరా’. శ్రీకాంత్ ఓదెల దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ మూవీని వచ్చే ఏడాది మార్చిలో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.
Recent Random Post: