
హీరోయిన్ రష్మిక మందన్న ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ హీరోయిన్ అన్న మాటకు ఎలాంటి సందేహం లేదు. టాలీవుడ్‌లో బ్యాక్‌టు-బ్యాక్ హిట్స్‌తో దూసుకుపోతూనే, వరుసగా తెలుగు సినిమాలు చేస్తోంది. మరోవైపు తమిళ చిత్రాల్లోనూ బిజీగా ఉంది. సొంత భాష అయిన కన్నడలోనూ అవకాశాలు కొనసాగుతుండగా, బాలీవుడ్‌లో కూడా ఆగకుండా సినిమాలు చేస్తూ పాన్ ఇండియా స్థాయిలో తన మార్కెట్‌ను మరింత విస్తరించింది. అందుకే అభిమానులు ఆమెను ప్రేమగా ‘నేషనల్ క్రష్’ అంటూ పిలుచుకుంటున్నారు.
ఇప్పుడు రష్మిక మరో అరుదైన ఘనతతో వార్తల్లో నిలిచింది. నటిగా మాత్రమే కాకుండా పన్ను చెల్లింపుల్లోనూ నెం.1 స్థానాన్ని దక్కించుకుని అందరినీ ఆశ్చర్యపరిచింది. కుటుంబానికి చెందిన వ్యాపారాల్లోనూ భాగస్వామిగా ఉండటంతో పాటు, సినిమాల ద్వారా భారీ ఆదాయం పొందుతున్న రష్మిక ఈ ఆర్థిక సంవత్సరంలో అత్యధికంగా పన్ను చెల్లించినట్లు తెలుస్తోంది.
జాతీయ మీడియా కథనాల ప్రకారం, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తొలి మూడు త్రైమాసికాలకుగాను రష్మిక మందన్న ఏకంగా ₹4.69 కోట్ల పన్ను చెల్లించిందట. కన్నడకు చెందిన హీరోయిన్ ఈ స్థాయిలో పన్ను చెల్లించడం చాలా అరుదైన విషయం. అంతేకాదు, ఆమె సొంత జిల్లా కొడగులో అత్యధిక పన్ను చెల్లించిన వ్యక్తిగా రష్మిక నెం.1 స్థానంలో నిలిచింది. ఒక్కో సినిమాకు కోట్లు పారితోషికం అందుకుంటున్న ఆమె, ఇటీవల లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో లాభాల్లో వాటా కూడా తీసుకున్నట్లు వార్తలు రావడంతో ఆదాయం మరింత పెరిగినట్టుగా ఇండస్ట్రీ వర్గాలు చర్చిస్తున్నాయి.
సినిమాల విషయానికి వస్తే, ఇటీవలే ‘ది గర్ల్‌ఫ్రెండ్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కమర్షియల్ ఫలితాన్ని పక్కన పెడితే, ఆలోచింపజేసే మంచి సినిమాగా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. గత ఏడాదిలో ఛావా, సికిందర్, కుబేరా, థామా, ది గర్ల్‌ఫ్రెండ్ వంటి చిత్రాలతో ప్రేక్షకులను అలరించింది. సికిందర్ మినహా మిగతా సినిమాలన్నీ ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. అందుకే గత సంవత్సరం రష్మిక కెరీర్‌కు చాలా కలిసొచ్చిందని అంటున్నారు.
ఈ ఏడాదిలోనూ ఆమె రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. తెలుగులో ‘మైసా’ అనే సినిమాలో పవర్‌ఫుల్ పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడయ్యే అవకాశముంది.
వ్యక్తిగత జీవితానికి వస్తే, రష్మిక గత కొంతకాలంగా హీరో విజయ్ దేవరకొండతో ప్రేమలో ఉందన్న వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. ఈ విషయంపై ప్రశ్నలు అడిగితే నవ్వుతూ తప్పించుకుంటూ వస్తోంది. ఇద్దరి నిశ్చితార్థం పూర్తయ్యిందన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. త్వరలోనే పెళ్లి జరగొచ్చన్న టాక్ నడుస్తుండటంతో, రష్మిక ప్రస్తుతం సినిమాల విషయంలో సెలెక్టివ్‌గా వ్యవహరిస్తోందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ఇదే కారణంతో ఇటీవల ఓ పెద్ద స్టార్ హీరో సినిమా ఆఫర్‌ను కూడా ఆమె సున్నితంగా తిరస్కరించిందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.
Recent Random Post:















