
మార్చిలో ఫెయిలైతే సెప్టెంబర్ ఉందిగా అనుకోవడానికి లేదు! విద్యార్థులు అకడమిక్ పరీక్షల్లో విజయం సాధించేందుకు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. పరీక్షల సమయం దగ్గరపడితే టెన్షన్‌తో పుస్తకాలు వదలని స్థితి. సరైన మార్గదర్శకత్వం లేకపోతే, వారు అనవసర ఒత్తిడికి లోనవ్వడం, తీవ్ర నిర్ణయాలు తీసుకోవడం చూస్తూనే ఉన్నాం. కొన్ని ఘటనల్లో విద్యార్థులు తమ తల్లిదండ్రులకు, గురువులకు తమ భావాలను వ్యక్తపరచలేక ఆత్మహత్యలు చేసుకోవడం మనకు గమనించదగిన విషయం.
ఈ సమస్యను పరిష్కరించేందుకు ‘పరీక్షా పే చర్చా’ కార్యక్రమం విద్యార్థులకు మానసిక స్థైర్యం, ఒత్తిడి నిర్వహణపై అవగాహన కల్పిస్తోంది. ప్రధాని నరేంద్ర మోడీ ప్రతిఏటా నిర్వహించే ఈ కార్యక్రమంలో విద్యార్థులు పరీక్షల ఒత్తిడిని తగ్గించుకోవడానికి మార్గదర్శకత్వం పొందుతున్నారు.
తాజాగా దీపికా పదుకొనే తన ఇన్‌స్టాగ్రామ్‌లో ‘పరీక్షా పే చర్చా’ ఎనిమిదో ఎడిషన్‌లో భాగంగా ప్రసారం కానున్న రెండవ ఎపిసోడ్‌కు సంబంధించిన వీడియోను షేర్ చేశారు. ఈ ఎపిసోడ్లో విద్యార్థుల మానసిక ఆరోగ్యంపై చర్చించేందుకు దీపికా పాల్గొంది. విద్యార్థులు తమ భావాలను వ్యక్తపరచడం ఎంత ముఖ్యమో వివరించారు. కుటుంబ సభ్యులు, స్నేహితులతో ఓపెన్‌గా మాట్లాడటం మానసిక ఒత్తిడిని తగ్గించేందుకు ఎంత అవసరమో ఆమె తెలియజేశారు. “నేను గణితంలో బలహీనంగా ఉన్నాను.. ఇప్పటికీ అలాగే! కానీ ప్రధాని మోడీ తన పుస్తకంలో చెప్పినట్లుగా, మన భావాలను అణచివేయకుండా అవి వ్యక్తపరచడం ముఖ్యం,” అని దీపికా తెలిపారు.
ఈ ఏడాది ‘పరీక్షా పే చర్చా’ కార్యక్రమం సోమవారం ప్రారంభమైంది. ప్రధాని మోడీ ఢిల్లీలోని సుందర్ నర్సరీను సందర్శించి, విద్యార్థులతో పరీక్షల ఒత్తిడిని ఎలా ఎదుర్కోవాలో చర్చించారు. ఈ కార్యక్రమంలో దీపికా పదుకొనే, బాక్సర్ మేరీ కోమ్, ఆధ్యాత్మిక గురువు సద్గురు వంటి ప్రముఖులు విద్యార్థులతో జీవిత పాఠాలను, ఒత్తిడిని ఎదుర్కొనే చిట్కాలను పంచుకున్నారు.
ఇలాంటి కార్యక్రమాలు విద్యార్థులకు మార్గదర్శకంగా నిలిచి, వారి భవిష్యత్తును మెరుగుపర్చేలా ఉండాలని ఆశిద్దాం!
Recent Random Post:















