
కింగ్ నాగార్జున ముఖ్య పాత్రలో, ధనుష్ హీరోగా నటించిన మూవీ ‘కుబేర’ విడుదలకు సిద్ధమైంది. నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాను సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల తెరకెక్కించారు. ధనుష్ ఒక బిచ్చగాడిగా, నాగార్జున ఓ కోటీశ్వరుడిగా కనిపించబోతున్న ఈ చిత్రం జూన్ 20న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది.
ప్రస్తుతం ప్రమోషన్స్ వేగంగా జరుగుతుండగా, ఆదివారం హైదరాబాద్‌లో ప్రీ-రిలీజ్ ఈవెంట్ నిర్వహించేశారు. ఈ ఈవెంట్‌లో యాంకర్ సుమ టీమ్ మెంబర్స్‌తో ఇంట్రెస్టింగ్ చిట్ చాట్ చేసింది. ఈ సందర్భంగా హీరో ధనుష్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
అవకాశం వస్తే పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌తో డైరెక్టర్‌గా పనిచేయాలనే తన కోరికను ధనుష్ బయటపెట్టారు. ధనుష్ మాటలు ఇప్పుడు ఇండస్ట్రీలోనూ, అభిమానుల్లోనూ హాట్ టాపిక్‌గా మారాయి.
ప్రస్తుతం పవన్ కల్యాణ్ జనసేన పార్టీ వ్యవహారాలతో పాటు, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి బాధ్యతలతో బిజీగా ఉన్నారు. ఇప్పటికే గతంలో అంగీకరించిన సినిమాల షూటింగ్స్‌కే సమయం కేటాయించలేకపోయారు. ‘హరి హర వీరమల్లు’, ‘ఓజీ’, ‘ఉస్తాద్ భగత్ సింగ్’ వంటి చిత్రాల షూటింగ్స్ వరుసగా వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఇటీవల పవన్ ‘హరి హర వీరమల్లు’ను పూర్తి చేయగా, ‘ఓజీ’లో తన పార్ట్ కంప్లీట్ చేశారు. ప్రస్తుతం హరీష్ శంకర్ డైరెక్షన్‌లో రూపొందుతున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ షూటింగ్‌లో పాల్గొంటున్నారు.
ఇంతకాలం పవన్ కోసం దర్శకులు క్రిష్, సుజీత్, హరీష్ శంకర్ ఓపికగా ఎదురుచూశారు. అలాగే సురేందర్ రెడ్డి కూడా పవన్ డేట్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు.
ఈ నేపథ్యంలో ధనుష్ తన దర్శకత్వ డ్రీమ్‌ను సాకారం చేసుకోవాలంటే ఇంత కాలం ఓపికగా వేచి ఉండాల్సిన అవసరం ఉంటుంది. నటుడిగా బిజీగా ఉండే ధనుష్ ఆంతటి సమయాన్ని వెచ్చించగలడా? పవన్ కూడా ధనుష్‌కు ఆ అవకాశం కల్పిస్తారా? అనే ఆసక్తికరమైన చర్చ ప్రస్తుతం ఫిల్మ్ సర్కిల్స్‌లో నడుస్తోంది.
Recent Random Post:















