
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కి ఉన్న క్రేజ్, ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏపీ రాజకీయాల్లో బిజీగా ఉన్నప్పటికీ, తన అభిమానులను అలరించేందుకు సినిమాలను కూడా చేస్తూనే ఉంటారు. ఆయన నటించిన తాజా చిత్రం హరి హర వీరమల్లుం జూలై 24న విడుదలై మంచి టాక్‌ను సొంతం చేసుకుంది. క్రిష్ జాగర్లమూడి, జ్యోతి కృష్ణ దర్శకత్వంలో వచ్చిన ఈ హిస్టారికల్ మూవీ లో వీరమల్లు పాత్రలో పవన్ అద్భుతంగా నటించారు.
సినిమా విడుదలకు ముందు ప్రమోషన్స్‌లో పవన్ యాక్టివ్‌గా పాల్గొని సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేశారు. మీడియా ఇంటర్వ్యూలు, ప్రీ-రిలీజ్ ఈవెంట్స్ అన్నీ హాజరై సినిమాను నిత్యం వార్తల్లో నిలిపారు. తాజాగా మూవీ యూనిట్ ఏర్పాటు చేసిన సక్సెస్ మీట్‌కి కూడా పవన్ హాజరయ్యారు.
ఈ ఈవెంట్‌లో ఒక నటి పవన్ దగ్గరకు వచ్చి ఫోటో దిగడమే కాకుండా స్టేజ్‌పైనే ఆయనను హత్తుకుంది. చాలా సింపుల్‌గా ఉండే పవన్ కళ్యాణ్ ఆ క్షణానికి సిగ్గు పడ్డారు. అయితే ఆమె మాత్రం హగ్ ఇచ్చి, ఫోటో దిగాక ఆనందంతో స్టేజ్ పై గంతులేసింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
తర్వాత మీడియాతో మాట్లాడిన ఆమె, తాను పవన్ కళ్యాణ్‌కి ఎంత పెద్ద అభిమాని అని చెప్పింది. అంతేకాదు, ఒకసారి పవన్ తాగిన వాటర్ బాటిల్‌ను ఈ రోజు వరకు భద్రంగా దాచుకున్నానని చెబుతూ, హ్యాండ్‌బ్యాగ్‌లోంచి ఆ బాటిల్‌ని చూపించింది. ఈ క్షణం చూసిన వారంతా ఆశ్చర్యపోయారు.
“పవన్ గారు నన్ను గుర్తించడమే గర్వంగా ఉంది. ఆయనతో ఒక్క సినిమా చేసే అవకాశం వస్తే చనిపోయినా పరవాలేదు” అంటూ ఎమోషనల్ అయ్యింది.
ఈ వీడియోపై సోషల్ మీడియాలో మిశ్రమ స్పందనలు వస్తున్నాయి. కొందరు “అభిమానం ఉండొచ్చు కానీ ఇంత ఓవర్ అవ్వాల్సిన అవసరం ఉందా?” అని కామెంట్స్ చేస్తుంటే, మరికొందరు “ఇదే పవన్ ఫ్యాన్స్‌కి ఉన్న ప్రేమ” అంటూ షేర్ చేస్తున్నారు.
Recent Random Post:















