
టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు మార్షల్ ఆర్ట్స్ పట్ల ఉన్న ఆసక్తి అందరికీ తెలిసిందే. కెరీర్ ప్రారంభం నుంచే ఆయన సినిమాల్లో కనిపించే ఫైట్స్, స్టంట్స్, మార్షల్ ఆర్ట్స్ మీద చూపిన డెడికేషన్‌కు నిదర్శనం. పవన్ చేసిన యాక్షన్ సీక్వెన్స్‌లు ఫ్యాన్స్‌ను ఎంతగానో ఆకట్టుకున్నాయి.
ఇలా ప్రత్యేకంగా తన మార్షల్ ఆర్ట్స్ ప్రయాణాన్ని ప్రజల ముందుకు తెచ్చేందుకు, ఇటీవల పవన్ కళ్యాణ్ తన సొంత నిర్మాణ సంస్థ పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ ప్రారంభించారు. ఈ బ్యానర్ ద్వారా ఆయన తన మార్షల్ ఆర్ట్స్ జర్నీ వీడియోను విడుదల చేస్తున్నారు. ఈ వీడియోలో ఆయన మొదటి సారి మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్న దశ నుంచి, ఇప్పటివరకు అంతర్జాతీయ స్థాయిలో పొందిన గౌరవం వరకు తన ప్రయాణాన్ని చూపించారు.
పవన్ కళ్యాణ్ చెన్నైలో ఉన్న సమయంలో కఠినమైన శిక్షణతో మార్షల్ ఆర్ట్స్ ప్రారంభించారు. ఆ తర్వాత జపాన్‌లోని ప్రాచీన యుద్ధకళలపై ఆసక్తి పెంచి లోతైన అధ్యయనం చేశారు. ముఖ్యంగా జపనీస్ సమురాయ్ సంప్రదాయంలో భాగమైన కెంజుట్సు (Kenjutsu) కత్తిసాము కళలో అధికారిక ప్రవేశం పొందారు. ఈ ప్రయాణం ఆయనకు అంతర్జాతీయ గుర్తింపు తెచ్చింది.
అంతేకాక, జపాన్‌లో అత్యంత గౌరవనీయమైన సంస్థ Sogo Budo Kanri Kai నుండి Fifth Dan (ఐదవ డాన్) పురస్కారం లభించడమే కాక, సోకే మురమత్సు సెన్సైకి చెందిన Takeda Shingen Clanలో ప్రవేశం పొందిన తొలి తెలుగు వ్యక్తిగా చరిత్రలో పేరును చేర్చుకున్నారు.
అదే కాక, Golden Dragons సంస్థ ద్వారా పవన్‌కు Tiger of Martial Arts ప్రత్యేక బిరుదుతో సత్కారం లభించింది. మొత్తం మార్షల్ ఆర్ట్స్ జర్నీ వీడియో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది.
వీడియో బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌ను టాలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ అందించారు. తన అనుభూతులను వ్యక్తపరుస్తూ తమన్ తెలిపారు:
“మా ప్రియమైన నాయకుడు పవన్ కళ్యాణ్ గారి అద్భుతమైన ప్రయాణంలో భాగం కావడం నాకు గొప్ప గౌరవం. పీకే మార్షల్ ఆర్ట్స్ జర్నీ ఇంకా ఎన్నో ప్రత్యేక క్షణాలను చూపబోతోంది. దీనికి సంగీతం అందించడం ఎంతో ఉత్సాహం ఇచ్చింది. మా నాయకుడికి నా గౌరవం, ప్రేమ.”
Recent Random Post:















