పవన్ సీఎం కావాలని కోరుకోనంటున్న రేణు దేశాయ్..!

రవితేజ హీరోగా వంశీ డైరెక్షన్ లో వచ్చిన సినిమా టైగర్ నాగేశ్వర రావు. అభిషేక్ అగర్వాల్ బ్యానర్ లో నిర్మించిన ఈ సినిమాలో రేణు దేశాయ్ కూడా ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశారు. హేమలత లవణం పాత్రలో రేణు దేశాయ్ నటించగా సినిమాలో ఆమె పాత్రపై చాలా హైప్ రాగా సినిమా చూశాక ఆడియన్స్ నిరాశపడ్డారు. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రేణు దేశాయ్ పవన్ గురించి కూడా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

పవన్ కళ్యాన్ తో విడిపోయాక తన లైఫ్ లీడ్ చేస్తున్న రేణు దేశాయ్ సినిమాలకు చాలా దూరంగా ఉంటూ వస్తుంది. ఈ క్రమంలో రీసెంట్ గా రవితేజ హీరోగా టైగర్ నాగేశ్వరరావు సినిమాలో నటించింది. ఈ సినిమాలో ఆమె హేమలత లవణం పాత్రలో నటించింది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా రేణు దేశాయ్ స్పెషల్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.

ఈ క్రమంలో పవన్ సీఎం కావాలని కోరుకుంటున్నారా అనే ప్రశ్న ఎదురవగా ఆ ప్రశ్న అడగొద్దని అన్నారు రేణు దేశాయ్. ఒక పొలిటీషియన్ గా ఈ సొసైటీకి అవసరం అని మాత్రమే ఇది వరకు వీడియోలో చెప్పా.. అది నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే. ఆయన సీఎం అవుతారా లేదా అని నేను చెప్పలేనని అన్నారు రేణు దేశాయ్. ఆ విషయాన్ని దేవుడే డిసైడ్ చేస్తారని.. ఫలానా వ్యక్తికి ప్రచారం చేయండి అని నేను ఎలాంటి ఎన్నికల ప్రచారం చేయను. అది నాకు అవసరం లేని విషయమని అన్నారు రేణు దేశాయ్.

పవన్ గురించి తాను చెప్పిన విషయాలన్నీ వీడియోలో చెప్పిన నిజాలే అన్నారు. విడాకుల టైం లో నేను ఏదైతే చెప్పానో అదంతా నిజమే.. సింగిల్ మదర్ గా చాలా కష్టాలు పడ్డానని. తన బిడ్డలు తప్పు చేస్తే తననే తప్పుపట్టండని అన్నారు రేణు దేశాయ్. టైగర్ నాగేశ్వర రావు లో ఆమె పాత్ర గురించి రిలీజ్ ముందు బాగా హైప్ తీసుకురాగా సినిమా చూశాక ఆడియన్స్ నిరాశపడ్డారు. రేణు దేశాయ్ కేవలం సినిమాపై బజ్ పెంచేందుకు తప్ప ఏమాత్రం ఉపయోగపడలేదని చెప్పొచ్చు.


Recent Random Post: