
ఈరోజు దేశవ్యాప్తంగా స్టార్ హీరోలు ఆశగా ఎదురుచూస్తున్న డైరెక్టర్ అంటే, అది సుకుమారే. రాజమౌళి తర్వాత పాన్ ఇండియా స్థాయిలో పేరు తెచ్చుకున్న దర్శకుడు ఎవరంటే, విరామంలేకుండా సుకుమార్ పేరు వినిపిస్తుంది. పుష్ప విజయంతో దేశవ్యాప్తంగా గుర్తింపు సంపాదించిన సుకుమార్, ఇప్పుడు కోట్ల రూపాయల పారితోషికం అందుకుంటున్నారు. అతను ఓ సినిమా చేస్తానని ప్రకటించగానే, వందల కోట్ల బడ్జెట్‌తో నిర్మాతలు ముందుకు వస్తున్నారు.
అయితే, అంత పెద్ద స్థాయికి చేరినా కూడా… తన గతాన్ని, మూలాలను సుకుమార్ ఎప్పటికీ మర్చిపోవడంలేదు. ప్రతి ఇంటర్వ్యూలోనూ, ప్రతి వేదికపైనూ తన ప్రస్థానాన్ని గుర్తుచేసుకుంటూ నూతన దర్శకులకు ప్రేరణగా నిలుస్తున్నారు. పాన్ ఇండియా ఫేమ్ పొందిన వెంటనే ప్లాపుల్లో ఉన్న డైరెక్టర్ పూరి జగన్నాథ్‌ను గుర్తు చేసుకోవడం, “మీ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ అవ్వాలనే కష్టపడ్డ రోజులు మర్చిపోలేను” అని చెప్పడం సుకుమార్ గొప్పదనాన్ని చాటుతుంది.
ఇటీవల మరో సందర్భంలో అర్జున్ హీరోగా నటించిన హనుమాన్ జంక్షన్ చిత్రానికి అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన రోజులను గుర్తు చేసుకున్నారు. ఓ సినిమా ప్రచార కార్యక్రమంలో ఈ విషయాన్ని స్వయంగా చెప్పిన సుకుమార్, తన జ్ఞాపకాల్లోకి వెళ్లిపోయారు. అలాగే ఉపేంద్ర దర్శకత్వంలో వచ్చిన సినిమాల స్క్రీన్‌ప్లే చూసి, తానూ అదే మాదిరిగా స్క్రిప్టు రాయడం మొదలెట్టిన విషయాన్ని పంచుకున్నారు.
ఇప్పుడు అర్జున్, ఉపేంద్ర లాంటి స్టార్లు క్యారెక్టర్ ఆర్టిస్టులుగా మారినా… సుకుమార్ మాత్రం మూలాలు మర్చిపోకుండా, ఆస్ట్రోగ్యాన్ని నేటి తరం ఎదిగేలా ప్రేరేపిస్తున్నారు. ఈ స్థాయికి వచ్చినవాళ్లు ఇలా మాట్లాడటం చాలా అరుదు. అలాంటి ఓపెనెస్, గట్స్ ఉండే వారికే ఇది సాధ్యమవుతుంది.
Recent Random Post:














