పుష్ప ఫ్రాంచైజ్.. పరిస్థితి ఎలా ఉందంటే..

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న పుష్ప పార్ట్ 2 కోసం ఓ వర్గం బన్నీ ఫ్యాన్స్ అయితే చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పుష్ప సూపర్ హిట్ కావడంతో దానికి సీక్వెల్ గా పుష్ప 2 చిత్రాన్ని సుకుమార్ అంతకుమించి అనేలా రెడీ చేస్తున్నారు. గత మూడేళ్లుగా ఈ మూవీ షూటింగ్ కొనసాగుతూనే ఉంది. ఇక మైత్రీ మూవీ మేకర్స్ ఖర్చుకు ఏమాత్రం వెనుకాడకుండా భారీ బడ్జెట్ తో పుష్ప 2 చిత్రాన్ని నిర్మిస్తోంది.

ఇదిలా ఉంటే ఈ పుష్ప ఫ్రాంచైజ్ లో పార్ట్ 3 కూడా ఉంటుందని ఇప్పటికే చిత్ర యూనిట్ లీక్ లు ఇచ్చింది. అల్లు అర్జున్ కూడా పుష్ప 3 కథకి ఒకే చెప్పేసాడనే టాక్ బయటకొచ్చింది. గతంలో బన్నీ కూడా ఓ మూవీ ఈవెంట్ లో పుష్ప 3 గురించి చూచాయగా చెప్పారు. అయితే ఎందుకనో పుష్ప 2 మీద ఉన్నంత హైప్ దీనికి సీక్వెల్ గా రాబోయే పుష్ప 3 మీద లేదని చెప్పాలి. ఫ్యాన్స్ కూడా ఈ సీక్వెల్ విషయంలో అంతగా ఎగ్జైట్ కావడం లేదు.

పుష్ప సినిమా చేయడానికి సుకుమార్ రెండేళ్ల సమయం తీసుకున్నారు. దానికి సీక్వెల్ గా పుష్ప 2 కోసం మరో మూడేళ్ళ టైం తీసుకుంటున్నారు. అంటే ఈ ఐదేళ్లలో బన్నీ నుంచి కేవలం 2 సినిమాలు మాత్రమే వచ్చాయి. ఫ్యాన్స్ కనీసం ఏడాదికి ఒక సినిమా అయిన తమ అభిమాన హీరో నుంచి రావాలని కోరుకుంటారు. అయితే రాజమౌళి కంటే ఆలస్యంగా సుకుమార్ ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు.

పోనీ ఈ సినిమాలేమైన బాహుబలి, ఆర్ఆర్ఆర్ రేంజ్ లో అవుట్ ఆఫ్ ది బౌండరీలో ఉండే సినిమాలా.. అంటే అది కాదు. పుష్ప 3 అంటే సుకుమార్ తప్పకుండా మరో మూడేళ్ళ సమయం అయిన తీసుకుంటాడు. ఇక పుష్ప 2 సినిమాపై ఇప్పుడు ఉన్న బజ్ పోగొట్టకుండా సినిమాకు మంచి ప్రమోషన్స్ చేయాల్సిన అవసరం ఉంది. అసలే 1000 కోట్ల టార్గెట్ అంటున్నారు. కాబట్టి ప్రమోషన్ డోస్ మరింత పెంచాల్సిన అవసరం ఉంది. ఈ సినిమా నిజంగా అద్భుతంగా ఉందనే టాక్ తెచ్చుకుంటే అప్పుడు పుష్ప 3పైన కొంత హైప్ క్రియేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది.

పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ లైన్ అప్ లో త్రివిక్రమ్ శ్రీనివాస్, అట్లీ ఉన్నారు. ఈ రెండింటి తర్వాత సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో మూవీ చేయాల్సి ఉంటుంది. ఈ మూడు కంప్లీట్ అయ్యాకనే పుష్ప 3 సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది. అంటే కనీసం 5 ఏళ్ళ తర్వాతనే పుష్ప 3 సినిమాని బన్నీతో సుకుమార్ చేయడానికి అవకాశం ఉంటుంది. అది కూడా పుష్ప 2 బ్లాక్ బస్టర్ హిట్ అయితేనే. ఒక వేళ పుష్ప2 సినిమాకే అంతంత మాత్రం ఆదరణ వస్తే ఇక పుష్ప 3 గురించి ఎవరూ పట్టించుకునే ఛాన్స్ ఉండదని సినీ విశ్లేషకులు అంటున్నారు.


Recent Random Post: