
టాలీవుడ్ యొక్క వెర్సటైల్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, కొంత విరామం తరువాత పలు క్రేజీ ప్రాజెక్ట్‌లను పట్టుకుని ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. అతని తాజా ప్రాజెక్ట్‌ను ఎంతో ఆసక్తిగా అందరూ ఎదురుచూస్తున్నారు. విలక్షణమైన నటన మరియు విభిన్నమైన కథలతో ప్రతి సినిమా ద్వారా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న తమిళ నటుడు మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి ఈ ప్రాజెక్టులో పూరితో కలిసి తొలిసారి నటిస్తున్నారు.
పూరి జగన్నాథ్, చార్మీ కలిసి పూరి కనెక్ట్స్ బ్యానర్‌లో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన కీలక నటీనటులను ముందే ప్రకటించారు. ఈ ప్రాజెక్ట్‌లో టాబు కూడా కీలక పాత్రలో కనిపించనున్నారని తెలియజేశారు. అల వైకుంఠపురములో సినిమా తర్వాత టాబు ఒప్పుకున్న తెలుగు సినిమా ఇదే. అటు కన్నడ నటుడు దునియా విజయ్ కూడా ఈ సినిమాలో కీలక పాత్రలో నటించనున్నాడు.
ఇక సినిమా విషయంలో మరొక ఆసక్తికరమైన అంశం ఈ సినిమా కోసం పూరి జగన్నాథ్ తన తనయుడు ఆకాష్ పూరిని ఓ కీలక పాత్ర కోసం తెచ్చుకోవడం. ఆకాష్ పూరి గత కొన్ని కాలంగా సరైన స్క్రిప్ట్ కోసం ఎదురుచూస్తున్నాడు. చోర్ బజార్ సినిమాకి తరువాత, ఆయన ఏ సినిమాకు అంగీకరించలేదు.
అయితే, పూరి జగన్నాథ్ తన తనయుడికి మంచి బ్రేక్ ఇవ్వాలని ఈ ప్రాజెక్టులో భాగంగా ఆకాష్ పూరిని తీసుకునే ఆలోచన చేశాడట. నాలుగేళ్ల క్రితం ఆకాష్ పూరి నటించిన రొమాంటిక్ మూవీకి పూరి జగన్నాథ్ కథ, మాటలు అందించినప్పటికీ, ఆ సినిమా పెద్దగా విజయం సాధించలేదు. ఇప్పుడు మరోసారి తన తనయుడితో ప్రపంచం చూస్తున్న ప్రాజెక్టులో భాగంగా మెట్టు ఎక్కించే ప్రయత్నం చేస్తున్నారు.
Recent Random Post:















