
లైగర్’, ‘డబుల్ ఇస్మార్ట్’ వంటి సినిమాలతో వరుసగా ఫెయిల్యూర్స్‌ను ఎదుర్కొన్న సీనియర్ డైరెక్టర్ పూరి జగన్నాథ్‌కి టాలీవుడ్‌లో అవకాశాలు తగ్గిపోయాయి. ఒకప్పుడు స్టార్ హీరోలతో సినిమాలు చేసిన ఆయనకు ఇప్పుడు అదే ఇండస్ట్రీలో సినిమా చేయడానికి హీరోలు వెనుకంజ వేస్తున్న స్థితి. అయితే పూరి మాత్రం వెనక్కి తగ్గకుండా కొత్త కథలతో ముందుకు సాగుతున్నాడు.
ఇందులో భాగంగా తమిళ నటుడిగా పేరు తెచ్చుకున్న విలక్షణ నటుడు విజయ్ సేతుపతితో పూరి ఓ కొత్త సినిమా చేయబోతున్నాడు. ఈ కాంబినేషన్ ఓవర్ నైట్‌గా జరిగిందేమీ కాదు. పూరి సిద్ధం చేసిన కథను వినగానే సేతుపతి వెంటనే ఓకే చెప్పినట్లు సమాచారం. పూరి–చార్మి కలిసి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.
ఇక తాజా అప్‌డేట్ ఏంటంటే… ఈ సినిమాకు నేషనల్ లెవెల్ క్రేజ్ తీసుకురావడానికి టబు జాయిన్ అవుతున్నారు. ఆమె పాత్ర చాలా పవర్‌ఫుల్ గా ఉండబోతుందట. పాత్ర డిజైన్, స్క్రిప్ట్ నచ్చి టబు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. టబు వంటి నటీమణి చేరడంతో ఈ చిత్రానికి పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు రావడం ఖాయమన్న అభిప్రాయం పరిశ్రమ వర్గాల్లో వినిపిస్తోంది.
విజయ్ సేతుపతి ఇందులో ఓ బిచ్చగాడి పాత్రలో కనిపించనున్నాడు. సామాజిక వ్యవస్థపై హార్డ్ హిట్టింగ్ సెటైర్లు, రఫ్ అండ్ రియలిస్టిక్ నేరేషన్‌తో సినిమా సాగనుందని టాక్. ఈసారి పూరి పూర్తి స్క్రిప్ట్ రాయకపోయినా, ఒక బేసిక్ ఐడియా ఇచ్చి ఇద్దరు యువ రచయితలతో స్క్రిప్ట్ తయారుచేసించాడట.
ఈ మూవీ వచ్చే నెలలో సెట్స్ మీదకు వెళ్లే అవకాశం ఉన్నట్లు సమాచారం. సేతుపతి, టబు లాంటి పెర్ఫార్మర్లు, పూరి స్టైల్ కథనంతో ఈ సినిమా పక్కా పాన్ ఇండియా హిట్టయ్యే ఛాన్సుంది!
Recent Random Post:















