పృథ్వీరాజ్ గురించి ‘బ్రో డాడీ’ షూటింగ్ విశేషాలు

Share


మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్, పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రల్లో నటించిన బ్రో డాడీ సినిమా మంచి విజయాన్ని సాధించింది. ఈ చిత్రం కరోనా సమయంలో ఓటీటీలో విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆ సమయంలో మెగాస్టార్ చిరంజీవి ఈ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయాలని భావించారు. అయితే, వరుస రీమేక్‌లు తక్కువ విజయాన్ని సాధిస్తున్న నేపథ్యంలో ఈ ప్రాజెక్టును పక్కనపెట్టారు. అయితే, ఇప్పుడు మరో సీనియర్ హీరో ఈ రీమేక్‌పై ఆసక్తి కనబరిచినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై ఇంకా అధికారిక క్లారిటీ రావాల్సి ఉంది.

ఇదిలా ఉంటే, తాజాగా బ్రో డాడీ సినిమాకు దర్శకత్వం వహించిన పృథ్వీరాజ్ సుకుమారన్ ఓ ఇంటర్వ్యూలో ఈ సినిమా నిర్మాణానికి సంబంధించిన ఆసక్తికర విషయాలను వెల్లడించారు. కరోనా సమయంలో ఇద్దరు రచయితలు తన వద్దకు వచ్చి ఓ మంచి కథ చెప్పారు. కథ విన్న వెంటనే హక్కులు తీసుకొని, ప్రాజెక్ట్‌ను మొదలుపెట్టినట్లు తెలిపారు.

పృథ్వీరాజ్ మాట్లాడుతూ, “మోహన్‌లాల్ గారు, నేను ఒకే ప్రాంతంలో ఉంటాం. మా మధ్య మంచి అనుబంధం ఉంది. కథ విన్న వెంటనే ఆయనకు చెప్పాను. అయితే, కరోనా కారణంగా కేరళలో సినిమా షూటింగ్స్‌కి అనుమతులు లేవు. అందుకే హైదరాబాద్‌లో చిత్రీకరించాలని నిర్ణయించుకున్నాం” అని తెలిపారు.

హైదరాబాద్‌లో తక్కువ బృందంతో అత్యంత జాగ్రత్తగా ఈ సినిమాను పూర్తి చేశామని ఆయన తెలిపారు. మొదటి రోజు నుంచి చివరి రోజు వరకు హైదరాబాద్‌లోనే షూటింగ్ జరిగిందని, స్థానిక అధికారుల సహకారం ఎంతో ఉపయోగపడిందని పేర్కొన్నారు.

బ్రో డాడీ మాత్రమే కాకుండా, హిందీ, తమిళ చిత్రాలు సైతం హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీ, అన్నపూర్ణ స్టూడియోలలో చిత్రీకరణ జరుపుతుంటాయి. ముఖ్యంగా స్టార్ హీరోల భారీ సినిమాలకు హైదరాబాద్ చిత్రీకరణ హబ్‌గా మారింది. ఈ కారణంగా ఫిల్మ్ మేకర్స్ తరచుగా ఇక్కడ షూటింగ్ చేయాలని ప్రాధాన్యత ఇస్తారని పృథ్వీరాజ్ తెలిపారు.


Recent Random Post: