
రామ్ చరణ్ హీరోగా, బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపొందుతున్న పాన్ ఇండియా చిత్రం ‘పెద్ధి’ షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. 2025 సమ్మర్లో విడుదల చేయాలని లక్ష్యంగా చిత్రబృందం ఎటువంటి ఆలస్యం లేకుండా బ్యాక్ టు బ్యాక్ షెడ్యూల్స్ ప్లాన్ చేస్తోంది. ఇప్పటికే కీలక సన్నివేశాలను పూర్తి చేసిన బృందం, యాక్షన్ సీక్వెన్స్‌లు, పాటల చిత్రీకరణకు సన్నాహాలు చేస్తోంది.
చిత్రానికి సంబంధించిన తాజా షెడ్యూల్ జూలై 12 నుంచి ఢిల్లీలో ప్రారంభం కానుంది. ఇందుకోసం చిత్ర బృందం ఇప్పటికే అక్కడకు వెళ్లి ప్రీ-ప్రొడక్షన్ పనులను పర్యవేక్షిస్తోంది. ఈ షెడ్యూల్లో రామ్ చరణ్ – జాన్వీ కపూర్‌లపై రొమాంటిక్ సీన్స్‌ను తెరకెక్కించనున్నారు. షెడ్యూల్ ముగిసేలోపు ఒక రొమాంటిక్ మెలోడి పాటను కూడా చిత్రీకరించనున్నారు. త్వరలోనే ఈ కాంబినేషన్‌కు సంబంధించిన వీడియో గ్లింప్స్ లేదా పోస్టర్ విడుదలయ్యే అవకాశం ఉంది.
జాన్వీ కపూర్ టాలీవుడ్‌కు ఎన్టీఆర్ నటిస్తున్న ‘దేవర’తో పరిచయమైన విషయం తెలిసిందే. ఆ సినిమాలో ‘తంగం’ పాత్రలో కనిపించిన జాన్వీ, ఇప్పుడు ‘పెద్ధి’లో మరింత గట్టిగా కనిపించనుంది. దర్శకుడు బుచ్చిబాబు గత చిత్రం ‘ఉప్పెన’లో హీరోయిన్‌కు ఎంత ప్రాముఖ్యత ఇచ్చారో గుర్తుండే ఉంటుంది. అలానే ఈ సినిమాలోనూ జాన్వీ పాత్రకు తగిన స్థాయిలో ఇంపాక్ట్ ఉండనుందని తెలుస్తోంది.
మెగా ఫ్యామిలీ వర్గాల సమాచారం ప్రకారం, ఢిల్లీ షెడ్యూల్ అనంతరం మరో రెండు షెడ్యూల్స్‌లో ‘పెద్ధి’ షూటింగ్‌ను పూర్తిచేయాలని బుచ్చిబాబు ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాలో రామ్ చరణ్ ఒక క్రీడాకారుడిగా కనిపించనున్నాడు. ఆసక్తికరమైన విషయం ఏంటంటే — ఈ సినిమా ఒకే ఒక్క క్రీడను కాకుండా, పలు ఆటలను కలగలిపిన స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్ కలిగిన కథతో సాగనుంది.
ఇక కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ కీలక పాత్రలో కనిపించనున్నారు. గతంలో క్యాన్సర్‌ను జయించిన శివన్న, షూటింగ్లో పాల్గొనడం సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. మరో షెడ్యూల్లో ఆయన మళ్లీ పాల్గొననున్నట్లు సమాచారం. మ్యూజిక్ డైరెక్టర్ ఏ.ఆర్. రెహ్మాన్ అందిస్తున్న సంగీతం ఈ సినిమాకు ప్రధాన హైలైట్ కానుంది.
Recent Random Post:














