పెళ్లి తర్వాత జోరు మీద కీర్తి సురేష్

Share


‘మహానటి’ ఫేం కీర్తి సురేష్ గత ఏడాది మూడు చిత్రాలతో ప్రేక్షకులను పలకరించింది. బాలీవుడ్‌లో ‘బేబీ జాన్‌’ అనే చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన కీర్తికి, ఆ సినిమా నిరాశజనక ఫలితాన్ని ఇచ్చినా ఆమె మీద ఆసక్తి మాత్రం తగ్గలేదు. అనూహ్యంగా, ఈ మూవీ ఫ్లాప్ అయినా హిందీ చిత్ర పరిశ్రమలో ఆమెకు వరుసగా కొత్త సినిమా మరియు వెబ్‌ సిరీస్ ఆఫర్లు వస్తున్నాయి. ఇప్పటికే ఒక వెబ్‌ సిరీస్ షూటింగ్ పూర్తయినట్టు సమాచారం, త్వరలోనే అది స్ట్రీమింగ్‌కు రానుంది. అంతేకాకుండా, ఆమె రెండు హిందీ సినిమాల కోసం చర్చల్లో ఉన్నట్టు సమాచారం.

సాధారణంగా బాలీవుడ్‌కి చెందిన సినిమాల్లో సౌత్‌ హీరోయిన్స్‌కి పెద్దగా ప్రాధాన్యత ఉండదనే అభిప్రాయం ఉంది. కానీ కీర్తి సురేష్ ఈ ట్రెండ్‌ను బ్రేక్ చేస్తూ తనకంటూ ప్రత్యేక స్థానం ఏర్పరుచుకుంటోంది. ఇటీవలే ఆమె పెళ్లి అయినా, ఆమె కెరీర్‌పై ఎలాంటి ప్రభావం పడలేదు. పెళ్లి తర్వాత కొంతకాలం గ్యాప్ తీసుకుంటూ సినిమాల్ని తగ్గించే హీరోయిన్స్‌తో పోల్చితే, కీర్తి మాత్రం పూర్తి ఉత్సాహంతో సినిమాల్లో భాగమవుతోంది.

ప్రస్తుతం ఆమె హిందీలో ఒక వెబ్‌ సిరీస్‌, రెండు సినిమాలతో బిజీగా ఉంది. అదే విధంగా తమిళ ఇండస్ట్రీలోనూ ఆమెకు విపరీతమైన డిమాండ్ ఉంది. ఇప్పటికే రెండు తమిళ సినిమాలు షూటింగ్ దశలో ఉండగా, ఇంకొన్ని ప్రాజెక్ట్స్ చర్చల్లో ఉన్నాయని సమాచారం. తెలుగులో చాలా కాలం తర్వాత ఒక సినిమా ఆఫర్ ఆమెను వెతుక్కుంటూ వచ్చిందనీ, మరోవైపు విజయ్ దేవరకొండతో చేయబోయే సినిమా కోసమూ చర్చలు జరుగుతున్నట్టు వార్తలు వెలువడుతున్నాయి.

పెళ్లి అయిన ఏడాదిలోనే అర డజను సినిమాలకు కమిట్ అవడం చాలా అరుదైన విషయం. నయనతార తర్వాత ఈ ఘనతను సాధించిందీ కీర్తి అని టాలీవుడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఆమె తెలుగు సినిమాల్లో మరిన్ని పాత్రలు చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఈ జోరు చూస్తుంటే, కీర్తి సురేష్ సినీ ప్రయాణం మరింత ఉజ్వలంగా సాగే అవకాశాలు ఉన్నాయి.


Recent Random Post: