పోలో ఆడుతుండగా సంజయ్ కపూర్ మృతి — బాలీవుడ్, వ్యాపార వర్గాల్లో దిగ్బ్రాంతి

Share


బాలీవుడ్ నటి కరిష్మా కపూర్ మాజీ భర్త, ప్రముఖ పారిశ్రామికవేత్త సంజయ్ కపూర్ హఠాన్మరణం బాలీవుడ్ ని, వ్యాపార వర్గాలను దిగ్భ్రాంతికి గురిచేసింది. ఇంగ్లాండ్‌లో గార్డ్స్ పోలో క్లబ్‌లో పోలో ఆడుతుండగా, హఠాత్తుగా గుండెపోటు రావడంతో ప్రాణాలు విడిచారు. ఆట జరుగుతున్న సమయంలో సంజయ్ కపూర్ నోట్లోకి ఓ తేనెటీగ దూరినట్టు, దాన్ని మింగిన వెంటనే తీవ్ర అలెర్జీ రియాక్షన్ వచ్చి శ్వాస ఆగిపోయినట్టు ప్రాథమికంగా గుర్తించారు.

సంజయ్ కపూర్ మరణం పురాతన చరిత్రను కూడా గుర్తు చేస్తోంది. 1210లో లాహోర్‌లో పోలో ఆడుతుండగానే బానిస రాజవంశ స్థాపకుడు కుతుబుద్దీన్ ఐబక్ గుర్రం మీద నుండి పడిపోయి ప్రాణాలు కోల్పోయిన విషయం చరిత్రలో ఉంది. అదే తరహాలో సంజయ్ కపూర్ మరణించడంతో ఈ విషయం నెట్టింట వైరల్ అయింది.

సంజయ్ కపూర్ భారత ఆటోమోటివ్ రంగంలో కీలక వ్యక్తిగా నిలిచారు. సోనా కామ్ స్టార్ కంపెనీ చైర్మన్‌గా భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఆటోమోటివ్ విడిభాగాల తయారీలో సంస్థను ముందుకు నడిపించారు. ఆటోమోటివ్ కాంపోనెంట్ మాన్యుఫాక్చర్స్ అసోసియేషన్ (ACMA) అధ్యక్షుడిగా సేవలు అందించారు. వ్యాపార రంగంలో విజయవంతమైన నేతగా పేరొందిన ఆయనకు పోలో ఆటపై ప్రత్యేకమైన ఆసక్తి ఉండేది. దేశీయ, అంతర్జాతీయ పోలో టోర్నమెంట్లలో పాల్గొని మంచి క్రీడాకారుడిగా కూడా గుర్తింపు పొందారు. ‘ఆరియస్’ పేరిట సొంత పోలో జట్టును కూడా నిర్వహించేవారు.


Recent Random Post: