బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ జంటగా నటించిన చిత్రం రాకీ ఔర్ రాణి. లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్ ట్రైనర్ గా ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు. కరణ్ జోహార్ ఈ సినిమా దర్శక నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. బ్యూటిఫుల్ ఫ్యామిలీ ఎంటర్ ట్రైనర్స్ తెరకెక్కించడంలో కరణ్ జోహార్ మంచి సిద్దహస్తుడు. గతంలో చాలా మంచి సినిమాలు అందించిన ఆయన చాలా కాలం తర్వాత గ్యాప్ తీసుకొని ప్రేక్షకుల ముందుకు ఈ సినిమాతో వస్తున్నారు.
ఇటీవల ఈ మూవీ టీజర్ విడుదల చేయగా త్వరలో ట్రైలర్ విడుదల చేయాలని భావిస్తున్నారు. ఇప్పటికే టీజర్ అందరినీ విపరీతంగా ఆకట్టుకుంది. లొకేషన్ చాలా అందంగా కనిపించాయి. రణవీర్ అలియాల మధ్య కెమిస్ట్రీ సైతం అందరినీ ఎట్రాక్ట్ చేసింది. మూవీ విడుదలకు ముందే ఫుల్ బజ్ క్రియేట్ చేసింది. ఈ మూవీ ప్రమోషన్స్ సైతం చిత్ర బృందం ఇప్పటి నుంచే మొదలుపెట్టింది.
కేవలం హీరో హీరోయిన్ రొమాంటిక్ ఫోటోలను షేర్ చేస్తూ ఆకట్టుకుంటున్నారు. ఆ పోస్టర్లు చూడటానికి బాగున్నాయి. ఈ ఫోటోలన్నింటిలోనూ అలియా చీరల్లోనే కనిపించడం విశేషం. వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ ఎంత బాగా వర్కౌట్ అయ్యిందో కేవలం ఈ ఫోటోలు చూస్తేనే అర్థమౌతోంది.వీరిద్దరి కెమిస్ట్రీ మూవీకి ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని చిత్ర బృందం చెబుతోంది. పోస్టర్లతోనే వీరు హీటు పెంచేస్తున్నారు.
కాగా ఇది కంప్లీట్ లవ్ స్టోరీ అని తెలుస్తోంది. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో గల్లీ బాయ్స్ సినిమా వచ్చింది. ఆ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అందులో వీరిద్దరి మధ్య లిప్ లాక్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు ఈ సినిమాలోనూ రొమాంటిక్ సీన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. అయితే గల్లీ బాయ్స్ మూవీ సమయానికి అలియాకి పెళ్లి కాలేదు. కానీ ఇప్పుడు ఆమెకు పెళ్లి జరిగింది. అందులోనూ ఈ మూవీలో హీరో రణవీర్ భార్య దీపికా గతంలో అలియా భర్త రణబీర్ కి గర్ల్ ఫ్రెండ్ కావడం విశేషం.
మరి ఇప్పుడు వీరిద్దరూ తెరపై ఇంతలా రొమాన్స్ పండించడం ఏదైనా సమస్యలకు దారితీస్తుందేమో అనే సందేహాలు చాలా మందికి కలుగుతున్నాయి. మరి సినిమాని సినిమాలా చూసి వదిలేస్తే మాత్రం ఎలాంటి సమస్య ఉండదు. ఈ సంగతి పక్కన పెడితే దాదాపు ఏడు సంవత్సరాల తర్వాత మెగా ఫోన్ పట్టిన కరణ్ జోహార్ ఈ మూవీని ఎలా తీస్తాడో చూడాలంటే విడుదలయ్యే వరకు ఆగాల్సిందే
Recent Random Post: