మెగా బ్రదర్ నాగబాబు సినిమాల్లో నటిస్తూ, టీవీ షోల్లో పాల్గొంటూ, జనసేన పార్టీలో పనిచేస్తూ బిజీగానే ఉంటారు. అలానే సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటారు. నాగబాబు రీసెంట్ గా చేస్తున్న కొన్ని ట్వీట్స్ వివాదాస్పదమవుతున్నాయి. మహత్మా గాంధీని చంపిన నాధూరామ్ గాడ్సే కూడా దేశభక్తుడే అని చేసిన ట్వీట్ ఎంతటి సంచలనం రేపిందో తెలిసిన విషయమే. రాజకీయంగా ప్రకంపనలు సృష్టించిన ఆ ట్వీట్ పై మంటలు చల్లారకముందే నాగబాబు చేసిన మరో ట్వీట్ వివాదాస్పదం అవుతోంది.
‘ఇండియన్ కరెన్సీ నోట్ల మీద సుభాష్ చంద్రబోస్, అంబేద్కర్, భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్, లాల్ బహదూర్, పీవీ నరసింహారావు, అబ్దుల్ కలాం, సావర్కార్, వాజ్ పేయి.. వంటి మహనీయుల చిత్రాలను కూడా చూడాలని ఉంది. స్వతంత్ర భారతం కల సాకారం కావడానికి కృషి చేసిన ఆ మహానుభావులను ప్రజలు మర్చిపోకూడదని ఒక ఆశ’ అంటూ పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ బాగా వైరల్ అవుతోంది.
ఇండియన్ కరెన్సీ నోట్లపై ఎప్పటినుంచో ఉండేది ఒక్క మహాత్ముడి ఫోటోనే. కరెన్సీ నోట్లు ఎన్న కొత్త రూపాల్లో వచ్చినా గాంధీ ఫొటోనే ముద్రిస్తున్నారు. దీనిపై ఎప్పుడూ ఎటువంటి చర్చ జరగలేదు. కానీ ఇప్పుడు నాగబాబు చేసిన ట్వీట్ మాత్రం చర్చనీయాంశం అవుతోంది.దీనిపై రాజకీయంగా ఎటువంటి విమర్శలు వస్తాయో రాజకీయ నాయకులు ఎలా స్పందిస్తారో చూడాలి.
Recent Random Post: