ప్రగతి ఆసియా స్థాయి పవర్ లిఫ్టింగ్ విజయం

Share


ప్రసిద్ధ నటి ప్రగతి, గతంలో తల్లి, అత్త, అక్క వంటి క్యారెక్టర్ పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. కరోనా తర్వాత సోషల్ మీడియాలో యాక్టివ్‌గా మారి పలు రీల్స్, స్టెప్పులతో పాపులారిటీ పొందారు.

జిమ్‌లో వర్కౌట్స్ ప్రారంభించి, పవర్ లిఫ్టింగ్‌లో నేషనల్, ఇంటర్నేషనల్ స్థాయిలో పథకాలు గెలిచారు. 50 ఏళ్ల వయసులో కూడా Asian Open and Masters Powerlifting Championship 2025లో నాలుగు పథకాలు సాధించడం అభిమానులను ఆశ్చర్యంలో పడేలా చేసింది.

గతంలో ట్రోల్స్ చేసినవారికి గట్టి కౌంటర్ ఇచ్చిన ప్రగతి, తన విజయాలను ఇండస్ట్రీలో ఉన్న ప్రతి మహిళకు అంకితం చేసిందని చెప్పారు.


Recent Random Post: