ప్రభాస్ కొత్త ప్రాజెక్ట్‌పై ఫ్యాన్స్‌లో చర్చ

Share


పాన్‌ ఇండియా స్టార్‌డమ్‌ అంటే చిన్న విషయం కాదు. వందల కోట్ల మార్కెట్‌, కోట్లాది అభిమానుల అంచనాలు — ఇవన్నీ బ్యాలెన్స్‌ చేయడం చాలా కష్టం. కానీ ఈ విషయంలో డార్లింగ్‌ ప్రభాస్‌ ప్రత్యేకమైన వ్యక్తి. ఇండస్ట్రీలో ఆయనకు “ప్రొడ్యూసర్స్‌ హీరో” అనే పేరుంది. ఒకసారి మాట ఇచ్చాడంటే, ఆ ప్రాజెక్ట్‌ కోసం ఎంత కష్టమైనా పడతాడని, స్నేహం, మాటకు విలువ ఇస్తాడని అందరూ చెబుతారు.

ప్రభాస్‌కి ఉన్న మరో పెద్ద ప్లస్‌ పాయింట్‌ ఆయన ‘నాన్‌ కాంట్రవర్షియల్‌ ఇమేజ్‌’. వివాదాలు, అనవసరమైన పంచాయతీలు అన్నిటికీ ఆయన చాలా దూరంగా ఉంటారు. తన పనిపైనే ఫోకస్‌ చేసి, తన సినిమాల చుట్టూ ఎలాంటి నెగిటివ్‌ వైబ్‌ లేకుండా చూసుకోవడం ఆయనకు అలవాటు. ఈ క్లీన్‌ ఇమేజే ఆయనను ఫ్యామిలీ ఆడియన్స్‌కి మరింత దగ్గర చేసింది.

ఇప్పుడు ఈ రెండు అంశాల గురించే సోషల్‌ మీడియాలో పెద్ద చర్చ మొదలైంది. తాజాగా, ఒక టాలెంటెడ్‌ యంగ్‌ డైరెక్టర్‌తో ప్రభాస్‌ కొత్త సినిమా చేయబోతున్నాడు అనే వార్త వైరల్‌ అయింది. హోంబలే ఫిల్మ్స్‌ లాంటి పెద్ద బ్యానర్‌లో ఈ కాంబినేషన్‌ ఫిక్స్‌ అవుతున్నట్లు టాక్‌ రావడంతో ఫ్యాన్స్‌ కూడా ఉత్సాహంగా ఉన్నారు. అయితే, అందరూ సజావుగా సాగుతుందనుకున్న సమయంలో, ఆ యువ దర్శకుడి పేరు చుట్టూ ఒక్కసారిగా వివాదం చెలరేగింది.

ఈ వివాదం పూర్తిగా ఆ దర్శకుడి వ్యక్తిగత జీవితానికి సంబంధించినదే అయినా, దాని ప్రభావం ఇప్పుడు ప్రభాస్‌ ప్రాజెక్ట్‌పై పడుతుందేమోనని ఫ్యాన్స్‌ ఆందోళన చెందుతున్నారు. ఇదే అంశం మీద సోషల్‌ మీడియాలో చర్చ రగిలింది. “ఎప్పుడూ క్లీన్‌ ఇమేజ్‌తో ఉండే ప్రభాస్‌ ఇప్పుడు ఇలా ఒక వివాదంలో ఉన్న దర్శకుడితో సినిమా చేయడం సేఫేనా?” అని అభిమానులు ప్రశ్నిస్తున్నారు.

“మాట ఇచ్చిన తర్వాత వెనక్కి తగ్గని ప్రభాస్‌, ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ముందుకు వెళ్తాడా? లేక తన నాన్‌ కాంట్రవర్షియల్‌ ఇమేజ్‌ను కాపాడుకునేందుకు కొత్త ఆలోచన చేస్తాడా?” అన్నదే ఇప్పుడు అందరి డైలమా.
ప్రస్తుతం ఆ యువ దర్శకుడు తనపై వచ్చిన ఆరోపణలను పూర్తిగా ఖండిస్తూ, అవి కావాలనే సృష్టించినవని స్పష్టీకరణ ఇచ్చాడు. అయినా కూడా, ప్రభాస్‌ లాంటి గ్లోబల్‌ స్టార్‌తో సినిమా అంటే, ఏ చిన్న నెగిటివిటీ కూడా ఉండకూడదు. కాబట్టి, ఈ ప్రాజెక్ట్‌ విషయంలో ప్రభాస్‌ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో చూడాలని ఫ్యాన్స్‌ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.


Recent Random Post: