
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో నటించిన భారీ చిత్రం ది రాజా సాబ్ మరో నాలుగు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. భారీ అంచనాల మధ్య విడుదలకు సిద్ధమవుతున్న ఈ సినిమాపై ఇప్పటికే మంచి బజ్ నెలకొంది. అయితే, రాజా సాబ్ ప్రమోషన్స్ విషయంలో ప్రభాస్ ఈసారి కూడా పరిమితంగానే కనిపిస్తున్నారని చెప్పాలి.
గత కొన్ని సినిమాల నుంచి ప్రభాస్ ప్రమోషనల్ ఈవెంట్స్‌కు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. అయితే ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన రాజా సాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ఆయన హాజరై అభిమానులను సర్‌ప్రైజ్ చేశారు. ఆ వేదికపై తన కెరీర్‌లోనే అత్యంత లాంగ్ స్పీచ్ ఇవ్వడం విశేషం. ఆయన మాటలు అభిమానుల్లో మంచి ఉత్సాహాన్ని నింపాయి.
అయితే ఆ ఒక్క ఈవెంట్‌తోనే ప్రభాస్ రాజా సాబ్ ప్రమోషన్స్‌ను ముగించినట్టే కనిపిస్తోంది. ఎందుకంటే సోమవారం ముంబైలో జరిగిన సినిమా ఫైనల్ సాంగ్ లాంచ్ ఈవెంట్‌కు ప్రభాస్ హాజరుకాలేదు. దర్శకుడు మారుతి, నిర్మాతలు, నటీనటులు అందరూ అక్కడ పాల్గొన్నప్పటికీ ప్రభాస్ మాత్రం దూరంగా ఉన్నారు. తాజాగా ఆయన ఇటలీకి హాలిడే ట్రిప్‌కు వెళ్లినట్లు సమాచారం.
సినిమా విడుదలకు ముందు విదేశాలకు వెళ్లడం ప్రభాస్‌కు కొత్తేమీ కాదు. గతంలో కూడా తన సినిమాల రిలీజ్‌కు ముందు ఇలాగే బ్రేక్ తీసుకున్న సందర్భాలు ఉన్నాయి. ఇటీవల దర్శకుడు సందీప్ రెడ్డి వంగాతో ఒక ఇంటర్వ్యూను ముందుగానే రికార్డ్ చేసిన ప్రభాస్, ఆ తర్వాత నేరుగా హాలిడే ట్రిప్‌కు ఇటలీ వెళ్లిపోయినట్లు తెలుస్తోంది.
సంక్రాంతి తర్వాత, అంటే రాజా సాబ్ విడుదల అనంతరం ఆయన తిరిగి భారత్‌కు వచ్చే అవకాశం ఉందని సినీ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఈసారి నార్త్ మార్కెట్ ప్రమోషన్స్‌కు ప్రభాస్ హాజరు కాకపోవడం అభిమానుల్లో కొంత నిరాశను కలిగిస్తోంది. ముఖ్యంగా హిందీ మార్కెట్‌లో ప్రభాస్‌కు ఉన్న భారీ క్రేజ్‌ను దృష్టిలో ఉంచుకుంటే, కనీసం ఒక్క రోజు అయినా హిందీ ప్రమోషన్స్‌కు సమయం కేటాయిస్తే బాగుండేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
గతంలో కొన్ని సినిమాలు తెలుగులో ఆశించిన స్థాయిలో ఆడకపోయినా, హిందీలో మాత్రం మంచి వసూళ్లు సాధించాయి. అలాంటి మార్కెట్‌కు రాజా సాబ్ ప్రమోషన్ మరింత ఉపయోగపడేదని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. అయినప్పటికీ, ప్రమోషన్స్‌కు దూరంగా ఉన్నా ప్రభాస్ స్టార్ పవర్ సినిమాకు పెద్ద బలంగా నిలుస్తుందని విశ్లేషకులు అంటున్నారు.
ఇక సినిమా విషయానికి వస్తే, దర్శకుడు మారుతి తెరకెక్కించిన ఈ చిత్రం హారర్ ఫాంటసీ జోనర్‌లో రూపొందింది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. మాళవిక మోహనన్, రిద్ధి కుమార్, నిధి అగర్వాల్ కీలక పాత్రల్లో నటించగా, సంజయ్ దత్ ముఖ్య పాత్రలో కనిపించనున్నారు. మరి నార్త్ మార్కెట్‌లో రాజా సాబ్ ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి.
Recent Random Post:















