
ఒకేసారి రెండు భారీ సినిమాలను సెట్స్‌పై ఉంచడం ప్రభాస్ కెరీర్‌కు కొంత మేర మేలు చేస్తున్నప్పటికీ, అదే స్థాయిలో సమస్యలను కూడా తెచ్చిపెడుతోంది. ప్యాన్ ఇండియా స్థాయి భారీ బడ్జెట్లతో తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్టులను సమతుల్యం చేయడం నిర్మాతలకు సవాల్‌గా మారుతోంది. ముఖ్యంగా రాజా సాబ్ ఆలస్యం ప్రభావం నేరుగా ఫౌజీపై పడిన విషయం ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చకు వచ్చింది.
సమాంతరంగా రెండు షూటింగులు నడిచిన సందర్భాల్లో ప్రభాస్ డేట్ల లభ్యత సమస్యగా మారి, అనుకున్న షెడ్యూళ్లు సమయానికి పూర్తికాకపోవడం తెలిసిందే. రాజా సాబ్ విడుదలై ఫలితం తేలిపోయిన నేపథ్యంలో, ప్రస్తుతం అందరి దృష్టి ఫౌజీపై కాకుండా స్పిరిట్పైకి మళ్లింది.
ఇప్పటికే సగం చిత్రీకరణ పూర్తిచేసుకున్న ఫౌజీ కంటే, ఇటీవలే ప్రారంభమైన స్పిరిట్ సినిమాకు 2027 మార్చి 5న విడుదల తేదీని అధికారికంగా ప్రకటించడం అభిమానులను ఆశ్చర్యానికి గురిచేసింది. మరోవైపు ఫౌజీ వాయిదాపై మైత్రి మూవీ మేకర్స్ నుంచి ఎలాంటి ప్రకటన లేకపోవడం, అలాగే విడుదల తేదీపై స్పష్టత లేకపోవడం అయోమయాన్ని మరింత పెంచుతోంది.
తన సినిమా పూర్తయ్యే వరకు ప్రభాస్ పూర్తిగా అదే ప్రాజెక్ట్‌కు కట్టుబడి ఉండాలన్న షరతును దర్శకుడు సందీప్ రెడ్డి వంగా విధించినట్టు వినిపిస్తున్న ప్రచారం నిజమైతే, ఫౌజీ ఆలస్యం మరింత పెరిగే అవకాశముంది. కారణం, స్పిరిట్లో ప్రభాస్ పూర్తిగా భిన్నమైన గెటప్‌లో కనిపించనున్నాడు.
ప్రస్తుతం అభిమానులు స్పష్టత లేక అయోమయంలో ఉన్నారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఫౌజీను ఈ ఏడాది విడుదల చేయాలన్న ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. అయితే బ్యాలెన్స్ షూట్‌కు ప్రభాస్ లభ్యత ఎంతవరకు ఉంటుందన్నదానిపై తుది నిర్ణయం ఆధారపడి ఉండనుంది.
కొన్ని వర్గాలు ఫౌజీ విడుదల 2028కి వాయిదా పడే అవకాశముందని ప్రచారం చేస్తున్నప్పటికీ, అంత దూరం వెళ్లే పరిస్థితి లేకపోవచ్చని ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి. ఇదిలా ఉండగా సలార్ 2, కల్కి 2 టీమ్స్ కూడా ప్రభాస్ కమిట్‌మెంట్ కోసం ఎదురు చూస్తున్నాయి. ఫౌజీ బృందం నుంచి త్వరలోనే ఏదో ఒక అధికారిక అప్డేట్ వస్తే, అభిమానులు ముందుగా ఏ సినిమాపై ఆశలు పెట్టుకోవాలో స్పష్టత వస్తుంది.
Recent Random Post:















