
అనుష్క సినిమాలు అంటే మేకర్స్‌కి ఎప్పుడూ నమ్మకం. ఆమె స్టార్‌డమ్, బాక్సాఫీస్‌లో ఉన్న రేంజ్ వల్లనే ఎక్కువగా ఫీమేల్ సెంట్రిక్ సినిమాలు ఆమెతో చేయడానికి రెడీ అవుతుంటారు. కానీ, గత కొంతకాలంగా లుక్స్‌లో మార్పులు రావడంతో అనుష్క ఎక్కువగా ప్రాజెక్టులు చేయలేదు. చివరిసారి నవీన్ పొలిశెట్టితో చేసిన మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమా ఓ మోస్తరు రేంజ్‌లోనే ఆగిపోయింది.
ఇక ఇప్పుడు క్రిష్ దర్శకత్వంలో వస్తున్న ఘాటి సినిమాతో మళ్లీ రీ-ఎంట్రీ ఇస్తోంది. యువి క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేం ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం సెప్టెంబర్ 5న విడుదల కానుంది. కానీ రిలీజ్‌కు వారం రోజులు మాత్రమే ఉండగా కూడా ప్రమోషన్స్‌లో అనుష్క ఎక్కడా కనిపించడం లేదు.
ఫ్యాన్స్ ఈ విషయంపై కొంత నిరాశ చెందుతున్నా, మేకర్స్ మాత్రం ఆమె సినిమా సైన్ చేసే సమయంలోనే “ప్రమోషన్స్‌లో పాల్గొనను” అని క్లారిటీ ఇచ్చిందని చెబుతున్నారు. ప్రస్తుతం సినిమా ప్రమోషన్స్ ఎంత ముఖ్యమో అందరికీ తెలిసిన విషయమే. పెద్దా, చిన్నా ప్రతి సినిమా టీమ్ ఆరాటపడుతుంటే, అనుష్క మాత్రం తన స్టాండ్ మార్చకపోవడం ఆసక్తికరంగా మారింది.
అంతేకాకుండా, ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి కూడా ఆమె హాజరు కావడం కష్టమేనని టాక్. అయితే, అనుష్క ఇలా నిర్ణయం తీసుకోవడానికి వెనుక బలమైన కారణాలు ఉండొచ్చని భావిస్తున్నారు.
అనుష్క విషయంలో ఒక విషయం మాత్రం క్లియర్ — సినిమా కోసం ఎలాంటి రిస్క్ అయినా తీసుకుంటుంది, ఛాలెంజింగ్ రోల్స్ చేస్తుంది. కానీ ప్రమోషన్స్ విషయానికి వస్తే మాత్రం దూరంగా ఉంటుంది. ఫ్యాన్స్ మాత్రం “భవిష్యత్తులో అయినా ఆమె ప్రమోషన్స్‌కి హాజరవ్వాలి” అని ఆశిస్తున్నారు.
ప్రస్తుతం ఘాటి ప్రమోషనల్ కంటెంట్ బాగానే ఇంప్రెస్ చేసింది. ఇక క్రిష్ కూడా సినిమా పట్ల చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాడు. అనుష్క లేకుండానే ప్రమోషన్స్ ఎలా ఇంపాక్ట్ చూపిస్తాయో, సినిమా థియేటర్స్‌లో ఎంతవరకు ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో చూడాలి.
Recent Random Post:














