
ఏ ప్రచారం లేకుండా, హఠాత్తుగా విడుదలైన మలయాళ సినిమా “తుడరుమ్” ఇప్పుడు టాలీవుడ్ ట్రేడ్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. హీరో మోహన్ లాల్ ఎల్2 ఎంపురాన్ తరహాలో ప్రచార యాత్రలలో పాల్గొనలేదు, దర్శకుడు తరుణ్ మూర్తి కూడా మీడియా ఇంటర్వ్యూలు ఇవ్వకుండా సినిమాను నిశ్శబ్దంగా రిలీజ్ చేశారు. కానీ రిలీజ్‌కి వారం కూడా కాకముందే ఈ సినిమా 100 కోట్ల క్లబ్ వైపు దూసుకెళ్తుండటంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు.
కేరళలో రిలీజ్ అయిన తొలి రోజు నుంచే హౌస్ ఫుల్ షోస్ నడుస్తుండగా, తెలుగు వర్షన్‌కు పెద్దగా ప్రచారం లేకపోయినా కొన్ని ప్రాంతాల్లో మంచి ఆక్యుపెన్సీ నమోదవుతోంది. సినిమా కాన్సెప్ట్ కొంతవరకు “దృశ్యం” సినిమా స్పూర్తిని గుర్తుచేసినా, “తుడరుమ్” కథ తనదైన ఒరిజినాలిటీతో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ప్రత్యేకించి ప్రీ ఇంటర్వెల్ నుంచి కథ వేగంగా పరుగులు పెట్టడం, జెక్స్ బిజోయ్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకు అదనపు బలంగా నిలిచాయి.
రంగస్థలం క్లైమాక్స్ టచ్, పోలీసులను ప్రతినాయకులుగా చూపిస్తూ, ఒక ఫ్యామిలీ థ్రిల్లర్‌గా తీర్చిదిద్దిన తరుణ్ మూర్తి స్టోరీ టెల్లింగ్ పద్ధతిని మెచ్చుకోకుండా ఉండలేం. “తుడరుమ్” సినిమాకు “జింఖానా” తరహాలో ఓ ప్రమోషనల్ బజ్ కలిగి ఉండి ఉంటే, ఇంకా పెద్ద రేంజ్ ఓపెనింగ్స్ వచ్చేవి అన్నది ట్రేడ్ వర్గాల అభిప్రాయం.
ఇక ప్రస్తుతం ఈ సినిమా 70 కోట్ల గ్రాస్ దాటి, వీకెండ్ లోనే సెంచరీ సాధించబోతోంది. ఈ స్పందనను చూసిన మేకర్స్ ఇప్పుడు తుడరుమ్ పార్ట్ 2పై ప్లానింగ్ మొదలుపెట్టారని సమాచారం. అంటే ఇది మరో కొత్త ఫ్రాంచైజ్ గా మారే అవకాశం ఉంది.
Recent Random Post:














