
బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా భారీ ఫాలోయింగ్ తెచ్చుకున్న ప్రియాంకా చోప్రా, దర్శకుడు ప్రకాశ్ ఝా తెరకెక్కించిన జై గంగాజల్ తర్వాత హాలీవుడ్‌లో అడుగుపెట్టింది. బేవాచ్ సినిమాతో అక్కడి ప్రేక్షకులను పలకరించిన పీసీ (ప్రియాంకా చోప్రా) ఆ తర్వాత వరుసగా హాలీవుడ్ ప్రాజెక్టుల్లో నటిస్తూ గ్లోబల్ బ్యూటీగా గుర్తింపు సాధించింది. నిక్ జోనస్‌ను వివాహం చేసుకుని అమెరికాలో సెటిలైపోయిన ప్రియాంకా, దాదాపు ఎనిమిదేళ్లుగా బాలీవుడ్‌కు గుడ్‌బై చెప్పేసినట్టయ్యింది.
ఇక ఇప్పుడు ఆమె దృష్టి మళ్లీ భారత సినిమాల వైపు తిరిగింది. కెరీర్ ఆరంభంలో తమిళ స్టార్ విజయ్‌తో కలిసి తమిళన్ సినిమాతో హీరోయిన్‌గా పరిచయమై, అదే ఏడాది తెలుగులో అపురూపం అనే సినిమాతో తెరపైకి వచ్చిన ప్రియాంకా ఆ తర్వాత సౌత్ ఇండస్ట్రీకి దూరంగా ఉండిపోయింది. అయితే 23 ఏళ్ల విరామం తర్వాత మళ్లీ దక్షిణాదిలో అడుగుపెడుతోంది.
ప్రస్తుతం రాజమౌళి-మహేష్ బాబు కాంబినేషన్‌లో రూపొందుతున్న పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ SSMB29లో ప్రియాంకా ప్రధాన పాత్రలో నటిస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ప్రస్తుతం ఒడిశాలో శరవేగంగా కొనసాగుతోంది. షూటింగ్ ప్రారంభమైన తర్వాత ప్రియాంకా చోప్రా హైదరాబాద్‌కి వచ్చి చిలుకూరు బాలాజీ ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన విషయం తెలిసిందే.
ఇప్పుడీ ప్రాజెక్ట్ తర్వాత ఆమె మరో క్రేజీ సినిమా చేయబోతుందనే వార్తలు వెలుగులోకి వచ్చాయి. పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ త్రివిక్రమ్, అట్లీ లాంటి స్టార్ డైరెక్టర్లతో రెండు పెద్ద సినిమాలు చేయబోతున్న సంగతి తెలిసిందే. ఇందులో అట్లీ దర్శకత్వంలో రూపొందే సినిమాకు ప్రియాంకా చోప్రా హీరోయిన్‌గా ఎంపికయ్యారని రూమర్స్ షికారు చేస్తున్నాయి. అయితే తాజా సమాచారం ప్రకారం ఇది వాస్తవం కాదని, ప్రియాంకా అట్లీ-అల్లు అర్జున్ సినిమాకు సంబంధం లేదని తెలుస్తోంది.
ప్రస్తుతం ఆమె పూర్తిగా రాజమౌళి సినిమా మీదే దృష్టి పెట్టిందని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.
Recent Random Post:














