ఫిల్మ్‌ఫేర్ కవర్‌పై విజయ్ దేవరకొండ మాస్ లుక్!

Share


టాలీవుడ్‌లో మాస్ హీరోగా, యూత్ ఐకాన్‌గా విజయ్ దేవరకొండ తనదైన గుర్తింపును ఏర్పరచుకున్నాడు. ‘పెళ్లి చూపులు’, ‘అర్జున్ రెడ్డి’ సినిమాలతో రాత్రికి రాత్రే స్టార్ స్టేటస్‌ను అందుకున్న విజయ్, తన యూనిక్ యాటిట్యూడ్, మాస్ అప్పీల్‌తో విపరీతమైన ఫాలోయింగ్‌ను సంపాదించాడు. స్క్రీన్‌పై ఆయన ఎనర్జీ, డైలాగ్ డెలివరీ, ఎమోషనల్ కనెక్షన్ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. ఈ ప్రత్యేకతలే ఆయనను తాజా మే ఎడిషన్ ఫిల్మ్‌ఫేర్ మ్యాగజైన్ కవర్‌స్టార్‌గా నిలిపాయి.

తాజాగా విడుదలైన ఫిల్మ్‌ఫేర్ కవర్‌లో విజయ్ దేవరకొండ బ్లాక్ లెదర్ జాకెట్, రఫ్ లుక్‌తో కనిపించాడు. “విజయ్ ఏ రేంజ్‌లో సక్సెస్ అయ్యాడు” అనే క్యాప్షన్‌తో వచ్చిన ఈ కవర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అభిమానులు ఈ లుక్‌కు పాజిటివ్ రెస్పాన్స్ ఇస్తూ, విజయ్ మార్క్ స్టైల్‌కు మళ్లీ మదహాలు చెబుతున్నారు. ఫిల్మ్‌ఫేర్ కూడా విజయ్‌లో ఉన్న అరుదైన శక్తిని, అతని డెస్టినీ టచ్‌ను ప్రశంసించింది.

ఇటీవల ‘లైగర్’, ‘ఖుషి’ సినిమాలు బాక్సాఫీస్ వద్ద పెద్దగా కలెక్షన్లు రాబట్టలేకపోయినప్పటికీ, విజయ్ క్రేజ్‌ మాత్రం ఏమాత్రం తగ్గలేదు. యువత ఆయన తదుపరి సినిమాల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తోంది. ప్రస్తుతం విజయ్ దేవరకొండ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందుతున్న ‘కింగ్‌డమ్’ అనే పీరియాడికల్ యాక్షన్ డ్రామాలో నటిస్తున్నాడు. ఇందులో ఆయన ఓ యోధుడి పాత్రలో కనిపించనున్నాడు. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రం జులై 4న విడుదల కానుంది. సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ సినిమా విజయ్‌కు మళ్లీ పెద్ద హిట్‌ను అందిస్తుందని అభిమానులు భావిస్తున్నారు.

ఇంకా, విజయ్ దేవరకొండ రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో ఓ వింటేజ్ డ్రామాలోనూ నటిస్తున్నాడు. ఇందులో ఆయన ఓ విప్లవాత్మక పాత్రను పోషించనున్నట్టు సమాచారం. ఈ చిత్రం 2026 చివరిలో పూర్తవ్వగా, 2027లో విడుదలయ్యే అవకాశముంది. ఈ రెండు ప్రాజెక్టులతో విజయ్ మళ్లీ బాక్సాఫీస్‌ను దున్నే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.


Recent Random Post: