
తన కెరీర్‌లో ఓపెన్‌గా ఇలాంటి వ్యాఖ్యలు చేసే హీరోలు అరుదు. కానీ మంచు విష్ణు తన తాజా వ్యాఖ్యలతో అందరినీ షాక్‌కి గురి చేశాడు. ‘కన్నప్ప’ సినిమాను ప్రమోట్ చేస్తూ జరిగిన ఇంటర్వ్యూలో విష్ణు స్పందిస్తూ — ప్రస్తుతం తనకు ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ లేదని నిజాయితీగా చెప్పడం విశేషంగా మారింది.
ఫ్యాన్స్ వల్ల సినిమాల రేంజ్ పెరగడం ఇప్పుడు జరిగే విషయం కాదని విష్ణు అభిప్రాయపడ్డాడు. ఒకప్పుడు ఆ విధంగా జరిగిందని, కానీ ఈ రోజుల్లో పరిస్థితి పూర్తిగా మారిపోయిందని చెప్పారు. ఓటీటీల వృద్ధి, యూట్యూబ్ ప్రభావంతో ప్రేక్షకులు థియేటర్‌కి రావడం తగ్గిపోయిందని, కేవలం ప్రత్యేకమైన కాన్సెప్ట్‌లతోనే ప్రేక్షకులు థియేటర్‌కి రావాలనుకుంటున్నారని విశ్లేషించాడు.
తనకు గతంలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేదని, కానీ ఆ ఫాలోయింగ్‌ను కోల్పోయానని కూడా విష్ణు అంగీకరించాడు. ఇక ‘కన్నప్ప’ సినిమా బడ్జెట్ విషయంలో మాట్లాడుతూ — ట్రిపుల్ ఫిగర్‌లో ఉందని తెలిపాడు. ఖచ్చితమైన సంఖ్యను ప్రకటిస్తే ఐటీ అధికారులు తమ ఇంటి తలుపు తడతారని తనదైన శైలిలో వ్యాఖ్యానించాడు. ఇతర సినిమాలతో పోల్చుతూ — ‘ఓజీ’ కంటే ఎక్కువగా, ‘రాజా సాబ్’ కంటే తక్కువగా బడ్జెట్ ఉంటుందని చెప్పిన విష్ణు మాటల్ని బట్టి చూస్తే ‘కన్నప్ప’ బడ్జెట్ రూ.200 కోట్ల పైమాటే ఉండే అవకాశముంది.
Recent Random Post:














