
కొన్నేళ్లుగా కోలీవుడ్ స్టార్ హీరో సూర్య వెనువెంటి ఫ్లాపులతో కొంత వెనుకబడినట్టే కనిపిస్తున్నారు. వరుసగా చేస్తున్న సినిమాలు ఆశలు పెంచినా, ఫలితాలు మాత్రం నిరాశపరుస్తుండటంతో ఆయనకు విజయాలు అందని ద్రాక్షలా మారాయి. తాజాగా వచ్చిన రెట్రో కాన్సెప్ట్ మూవీ కూడా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోవడంతో సూర్య ఆశలు మరోసారి ఛిన్నాభిన్నమయ్యాయి.
ఈ పరిస్థితుల్లో అయినా హిట్ కొట్టాలని సూర్య ప్రామిసింగ్ డైరెక్టర్ వెంకీ అట్లూరితో చేతులు కలిపారు. ‘తొలిప్రేమ’, ‘సార్’, ‘లక్కీ భాస్కర్’ లాంటి విజయవంతమైన చిత్రాలు తెరకెక్కించిన వెంకీ ప్రస్తుతం సూర్యతో కలిసి సూర్య 46 సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెంకీ అట్లూరి మాట్లాడుతూ – “సూర్యకి మూడు కథలు వినిపించాను. ఒక బయోపిక్, ఒక హీస్ట్ థ్రిల్లర్, మరొకటి ఫ్యామిలీ డ్రామా. వాటిలో ఫ్యామిలీ డ్రామాను ఆయన ఎంపిక చేసుకున్నారు” అని చెప్పారు. ఈ మూవీ తనకు గట్టి కమర్షియల్ హిట్ తీసుకురావాలన్నది సూర్య ఆశ.
అయితే ఈ విషయంపై నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన రావడంతో విమర్శలు కూడా ఎదురవుతున్నాయి. ‘‘హీస్ట్ థ్రిల్లర్ లేదా బయోపిక్ చేసినా బెటర్‌గా ఉండేదేమో… మళ్లీ ఫ్యామిలీ డ్రామా ఎందుకు?’’ అంటూ కొందరు కామెంట్లు చేస్తున్నారు. చివరకు ఈ సినిమా కూడా ఫ్లాప్ అయితే దానికి పూర్తి బాధ్యుడు సూర్యనే అవుతారని అంటున్నారు.
ఒకప్పుడు టాప్ గేమ్‌లో ఉన్న సూర్య, ఇప్పుడు తన మార్కెట్‌ను తిరిగి అందుకోవాలంటే ‘కరుప్పు’ మరియు ‘సూర్య 46’ సినిమాలు హిట్ అవ్వాల్సిందేనని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఈ రెండు సినిమాలు అయినా సూర్యకు కొత్త ఊపుని తీసుకురావాలన్నదే అభిమానుల ఆశ.
Recent Random Post:














