మలయాళ మెగాస్టార్ మమ్ముట్టీ బ్రహ్మయుగం అనే విభిన్నమైన సినిమాతో భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాడు. కమర్షియల్ ఎలిమెంట్స్ కు దూరంగా ఉన్నా కూడా మమ్ముట్టీ ప్రయోగంను చాలా మంది అభినందిస్తూ సోషల్ మీడియా ద్వారా చేసిన పోస్ట్ లు సినిమాకు మంచి వసూళ్లు వచ్చేలా చేశాయి.
బ్రహ్మయుగం సినిమాతో పోల్చితో మమ్ముట్టీ తాజా చిత్రం టర్బో కి నెగటివ్ టాక్ ఎక్కువగా వచ్చింది. మెగాస్టార్ మమ్ముట్టీ స్థాయికి టర్బో సినిమా ఏమాత్రం సెట్ కాలేదు అని, అసలు ఇలాంటి సినిమాలో ఎలా మమ్ముట్టీ నటించాడు అంటూ రివ్యూవర్స్ తో పాటు కొందరు ప్రేక్షకులు కూడా అసహనం వ్యక్తం చేశారు.
టర్బో కి ఏమాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా కూడా ఖచ్చితంగా వంద కోట్ల వసూళ్లు నమోదు చేసేది. నెగిటివ్ టాక్ రావడంతో కనీసం పాతిక కోట్ల వసూళ్లు అయినా ఈ సినిమా రాబడుతుందా అనే అనుమానాలు వ్యక్తం అయ్యాయి. కానీ అనూహ్యంగా టర్బో ఇప్పటి వరకు రూ.57 కోట్ల వసూళ్లు రాబట్టింది.
మలయాళ బాక్సాఫీస్ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం మమ్ముట్టీ గత చిత్రం బ్రహ్మ యుగం బాక్సాఫీస్ వద్ద దాదాపుగా రూ.60 కోట్ల గ్రాస్ వసూళ్లు నమోదు చేసింది. ఇప్పుడు టర్బో సినిమా రూ.57 కోట్ల వసూళ్లు నమోదు చేయడం నిజంగా ఆశ్చర్యంగా ఉందని బాక్సాఫీస్ వర్గాల వారు అంటున్నారు.
ఇంకో వారం రోజులు సినిమా కు ఓ మోస్తరు వసూళ్లు వచ్చి ఉన్నా కూడా ఖచ్చితంగా వంద కోట్ల వసూళ్ల లెక్క టచ్ చేసి ఉండేది. కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితి చూస్తూ ఆ నెంబర్ చేరడం అనేది అసాధ్యం. కానీ బ్రహ్మ యుగం వసూళ్లు మాత్రం క్రాస్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. నిజంగా ఇది సర్‌ప్రైజింగ్ అంటూ ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది.
Recent Random Post: