
టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లూ అర్జున్ – కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్లో రూపొందుతున్న భారీ ప్రాజెక్ట్‌పై అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. సైన్స్ ఫిక్షన్ నేపథ్యంతో హై-వోల్టేజ్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా సాగుతోంది. ఇప్పటికే దాదాపు 60 శాతం షూటింగ్ పూర్తయ్యిందని సినీ వర్గాల సమాచారం.
చిత్ర బృందం 2026 రెండో అర్ధభాగంలో షూటింగ్ పూర్తి చేసి, 2027 వేసవిలో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేయాలనే లక్ష్యంతో పని చేస్తోంది. ఈ క్రమంలోనే ఇప్పుడు బన్నీ–అట్లీ మూవీకి సంబంధించిన ఓటీటీ డీల్ చర్చలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి.
ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ ఈ సినిమాకి డిజిటల్ రైట్స్‌ను సొంతం చేసుకునేందుకు చర్చలు జరుపుతోందని టాక్ వినిపిస్తోంది. అన్ని భాషల డిజిటల్ హక్కుల కోసం ఏకంగా రూ.600 కోట్లు చెల్లించేందుకు సిద్ధంగా ఉందని సమాచారం. ఇది నిజమైతే, ఇప్పటివరకు ఏ భారతీయ సినిమాకీ ఖరారు కాని ఆల్‌టైమ్ రికార్డ్ ఓటీటీ డీల్ అవుతుంది. ఇప్పటికే పలువురు స్టార్ హీరోల సినిమాలు భారీ ఓటీటీ ఒప్పందాలు చేసుకున్నప్పటికీ, అల్లూ అర్జున్–అట్లీ మూవీ మాత్రం సరికొత్త చరిత్ర సృష్టించే దిశగా అడుగులు వేస్తోంది. దీంతో సినీ వర్గాల్లోనే కాదు, సోషల్ మీడియాలో కూడా ఈ అంశం హాట్ డిస్కషన్‌గా మారింది. “బన్నీ మూవీనా… మజాకానా!” అంటూ ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు.
సినిమా విషయానికొస్తే, అత్యాధునిక సాంకేతికతతో సన్ పిక్చర్స్ సంస్థ ఈ భారీ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తోంది. నిర్మాత కళానిధి మారన్ ఖర్చు విషయంలో ఎలాంటి వెనుకడుగు వేయకుండా, సినిమాను గ్లోబల్ స్థాయిలో నిలబెట్టేలా ప్రణాళికలు రచిస్తున్నారు. ఇందుకోసం భారీ స్థాయిలో క్రూ, క్యాస్టింగ్‌ను రంగంలోకి దించారు.
ఈ చిత్రంలో అల్లూ అర్జున్ సరసన బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె లీడ్ రోల్లో నటిస్తున్నారు. ఆమెతో పాటు మృణాల్ ఠాకూర్, రష్మిక మందన్న, జాన్వీ కపూర్ సహా పలువురు స్టార్ హీరోయిన్లు కీలక పాత్రల్లో కనిపించనున్నారని సమాచారం. ప్రతి పాత్రకు కూడా కథలో ప్రత్యేక ప్రాధాన్యం ఉంటుందని తెలుస్తోంది. హాలీవుడ్‌కు చెందిన ప్రముఖ టెక్నీషియన్లు ఈ ప్రాజెక్ట్‌కు వర్క్ చేస్తుండగా, యాక్షన్ సన్నివేశాలు, గ్రాఫిక్స్, సీజీఐతో ఇండియన్ సినిమాకు కొత్త ప్రమాణాలు తీసుకొచ్చేందుకు టీమ్ సిద్ధమవుతోంది.
Recent Random Post:















