నందమూరి బాలకృష్ణకు పద్మభూషణ్ పురస్కారం ప్రకటించడంతో, ఆయన అభిమానులు ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న గొప్ప క్షణం నిజమైంది. ఈ పురస్కారం కళల విభాగంలో, తెలుగు రాష్ట్రాల నుంచి బాలకృష్ణకు వరించింది. పద్మభూషణ్ అవార్డు అందుకోవడం బాలకృష్ణ ఫ్యాన్స్ కి చిరకాల జ్ఞాపకంగా నిలిచిపోతుంది. ఈ పురస్కారం అందుకున్న మరో అగ్ర హీరో అజిత్ కాగా, ఈ ఘనత దక్కిన రెండూ అగ్ర నటులే కావడం విశేషం.
తాతమ్మ కలతో తెరంగేట్రం చేసి బాలనటుడిగా కొద్ది సినిమాల్లో నటించాక, తండ్రి ఎన్టీఆర్ దర్శకత్వంలో ఆయనతో కలిసి నటించి సత్తా చాటిన బాలకృష్ణ, 1984లో సాహసమే జీవితతో సోలో హీరోగా కెరీర్ ప్రారంభించాడు. మంగమ్మ గారి మనవడు చిత్రం ద్వారా ఇండస్ట్రీ బ్రేక్ సంపాదించి, వెనక్కి తిరగాల్సిన అవసరం లేకుండా తన సత్తా చూపించాడు.
ముద్దుల మావయ్యతో మహిళా ప్రేక్షకుల ఆదరణను సాధించుకున్న బాలకృష్ణ, లారీ డ్రైవర్, రౌడీ ఇన్స్ పెక్టర లాంటి చిత్రాలతో మాస్ ఫాలోయింగ్ పెంచుకున్నాడు. ఆదిత్య 369 అనే సైన్స్ ఫిక్షన్ చిత్రంతో టాలీవుడ్ లో కొత్త జానర్ ను ప్రవేశపెట్టిన ఘనత కూడా బాలకృష్ణకే దక్కింది.
సమరసింహారెడ్డి వంటి ఫ్యాక్షన్ బ్యాక్‌డ్రాప్ లో రూపొందించిన చిత్రాలు పరిశ్రమకు కొత్త మార్గాన్ని చూపించాయి. ఎన్నో ఎత్తుపల్లాలు చూసిన బాలకృష్ణ, సింహతో కంబ్యాక్ ఇచ్చి అద్భుతమైన రికార్డులు సృష్టించాడు. డాకు మహారాజ్ వంటి వరుస బ్లాక్‌బస్టర్ చిత్రాలతో బాలకృష్ణ ఇప్పుడు ఆరు పదుల వయసులో కూడా తన దూకుడును కొనసాగిస్తున్నాడు.
హిందుపూర్ ఎమ్మెల్యేగా మూడు పర్యాయాలు ఎన్నికై, ఆ ప్రాంతం అభివృద్ధిలో తన ముద్ర వేసిన బాలకృష్ణ, బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి ద్వారా వేలాదిమంది రోగులకు జీవదానం చేస్తూ తన సేవలను కూడా కొనసాగిస్తున్నారు. బుల్లితెరపై అన్ స్టాపబుల్ షోతో అద్భుతమైన గుర్తింపు పొందిన బాలకృష్ణ, ఇప్పుడు పద్మభూషణ్ పురస్కారం అందుకుని కళాకారుల ఆభరణంగా వెలిగిపోతున్నారు. ఈ ఘనత సినీ ప్రపంచాన్ని ఆనందంతో ముంచెత్తింది.
Recent Random Post: