ఐదు భాషల్లో పాన్ ఇండియా వైడ్ గా సంచలనాలు సృష్టించిన మూవీ ‘బాహుబలి 2’. ప్రభాస్ రాజమౌళి కలయికలో తెరకెక్కిన ఈ సెన్సేషనల్ మూవీ ఐదు భాషల్లోనూ రికార్డు స్థాయి వసూళ్లని రాబట్టి అన్ బీటబుల్ రికార్డ్స్ ని క్రియేట్ చేసింది. అయితే ఇప్పుడు ఈ రికార్డ్స్ కి కాలం చెల్లబోతోందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. బాలీవుడ్ లోనూ ‘బాహుబలి 2’ హయ్యెస్ట్ గ్రాసర్ గా ఆల్ టైమ్ రికార్డ్ ని సెట్ చేసింది. అయితే ఈ రికార్డ్ ని ఇంత వరకు ఏ బాలీవుడ్ సినిమా క్రాస్ చేయలేకపోయింది.
ఇతర భాషల్లో ఇప్పటికే బాహుబలి 2 రికార్డ్స్ తుడిచి పెట్టుకుపోయాయి. కరోనా తరువాత తెలుగులో విడుదలైన ‘RRR’ కన్నడలో విడుదలైన కేజీఎఫ్ 2 కాంతార తమిళంలో విడుదలైన ‘పొన్నియిన్ సెల్వన్’ సినిమాలు ఆయా భాషల్లో ‘బాహుబలి రికార్డ్స్ ని క్రాస్ చేసి సరి కొత్త రికార్డుల్ని సృష్టించాయి. అయితే బాలీవుడ్ లో మాత్రం ఏ సినిమా కూడా బాహుబలి సెట్ చేసిన ఆల్ టైమ్ రికార్డ్స్ ని క్రాస్ చేయలేకపోయింది.
దాదాపు ఆరేళ్లుగా చాలా వరకు స్టార్ హీరోల సినిమాలు విడుదలవుతున్నా కానీ ఏ మూవీ కూడా ‘బాహుబలి’ రికార్డ్స్ ని టచ్ చేయలేకపోవడం గమనార్హం. అయితే రీసెంట్ గా విడుదలైన ‘పఠాన్’మాత్రం ‘బాహుబలి’ రికార్డ్స్ కి హిందీలో ఎండ్ కార్డ్ వేయబోతోంది. వరల్డ్ వైడ్ గా సంచలన విజయాన్ని సొంతం చేసుకన్న ‘పఠాన్’ ఇప్పటికే 1000 కోట్లకు మించి వసూళ్లని రాబట్టింది. బాలీవుడ్ లో హిందీ వెర్షన్ 500 కోట్లకు పైగా వసూళ్లని రాబట్టింది.
మరో 3.5 కోట్లు రాబట్టగలిగితే బాలీవుడ్ లో ‘బాహుబలి’ రికార్డ్ తెరమరుగైనట్టేనని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. కోవిడ్ తరువాత బాలీవుడ్ తీవ్ర ఇబ్బందుల్ని ఎదుర్కొంటోంది.
దాదాపు ఆరేళ్లుగా బాలీవుడ్ పెద్దగా రాణించింది లేదు. దీంతో ‘బాహుబలి’ రికార్డ్ ఇంత కాలం పదిలంగానే వుంది. కానీ ఇప్పుడు ‘పఠాన్’ కారణంగా తెరమరుగవబోతోంది. ‘బాహుబలి 2’ హిందీలో రికార్డుని నెలకొల్పి ఆరేళ్లు కావస్తోంది. ఇన్నేళ్ల తరువాత ఆ రికార్డ్ ని హిందీ సినిమా అధిగమించనుండటం ఆసక్తికరంగా మారింది.
అయితే మరో విషయంలో మాత్రం ‘బాహుబలి 2’ రికార్డ్ ని ‘పఠాన్’ బీట్ చేయలేకపోవడం విశేషం. ‘బాహుబలి 2’ని 5 కోట్ల మంది చూస్తే ‘పఠాన్’ని మాత్రం కేవలం 3.30 కోట్ల మంది మాత్రమే థియేటర్లలో వీక్షించనుండటం విశేషం. అంటే ఈ విషయంలో ‘బాహుబలి 2’ రికార్డ్ పదిలం అన్నమాటేగా.
Recent Random Post: