
తెలుగు సినిమా చరిత్రలో బాహుబలి ఒక సంచలనాత్మక సినిమా. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ తర్వాత తెలుగు సినిమాల రూపురేఖలే మారిపోయాయి. పాన్ ఇండియా, పాన్ వరల్డ్ స్థాయిలో తెలుగు సినిమాకు ఒక కొత్త స్టాండర్డ్ ఏర్పడింది, అది బాహుబలితోనే మొదలైంది. అందుకే బాహుబలి ఎప్పటికీ ప్రత్యేకంగా గుర్తించబడుతుంది.
రాజమౌళి బాహుబలి 1 & 2 సినిమాలను ప్రత్యేకంగా రూపొందించి, “నెవర్ బిఫోర్” రేంజ్లో రికార్డులు సృష్టించారు. ఐతే సినిమా రిలీజ్ అయినప్పటికి 10 ఏళ్లు గడిచినా, బాహుబలి హంగామా తగ్గలేదు. ఇప్పుడు బాహుబలి 1 & 2 కలిపి బాహుబలి ది ఎపిక్‌గా రిలీజ్ చేయబోతున్నారు.
ఈ రీ-రిలీజ్ ప్రత్యేకత ఏమిటంటే, రెండు భాగాలను ఒకే సినిమాలో చూపిస్తూ, కొన్ని కొత్త సీన్స్ కూడా యాడ్ చేస్తున్నారు. అంటే ప్రేక్షకులు మళ్లీ కొత్త ఎక్స్‌పీరియెన్స్‌ని పొందబోతున్నారు. కొన్ని అదనపు సీన్స్, ఇంకా బాహుబలి 3 గురించి చిన్న టీజ్ కూడా ఈ ఎపిక్‌లో చూపించనున్నారు. కథ బాహుబలి నేపథ్యాన్ని కట్టప్ప నేపథ్యంతో కొనసాగించేలా ప్లాన్ చేస్తున్నారు.
బాహుబలి ది ఎపిక్ అక్టోబర్ 31న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇది కొత్త సినిమా లాగా ప్రీ-రిలీజ్ ఈవెంట్ కూడా జరగనుంది, అక్కడ ప్రభాస్, రానా వంటి హీరోలు హాజరై ప్రేక్షకులను ఆకట్టించనున్నారు.
ఇప్పటికే రాజమౌళి మహేష్ బాబుతో SSMB 29 సినిమాపై పనిచేస్తున్నప్పటికీ, అక్టోబర్ మొత్తం బాహుబలి ది ఎపిక్ కోసం టైం కేటాయిస్తూ ఉన్నారు. జక్కన్న మళ్లీ బాహుబలి కోసం పనిచేయడం ఫ్యాన్స్‌కు సూపర్ జోష్ అందించబోతుంది.
Recent Random Post:














