
తెలుగు, తమిళం, హిందీతో పాటు ఇతర భాషల్లో కూడా బిగ్‌బాస్ షోకు మంచి క్రేజ్ ఉంది. ప్రతి సీజన్‌కు వివిధ రంగాల ప్రముఖులను ఇంటిలోకి ఆహ్వానిస్తుంటారు. సినిమా స్టార్స్, బుల్లితెర నటులు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, గాయకులు, డాన్సర్లు ఇలా అందరూ బిగ్‌బాస్‌లో పాల్గొనడానికి ఆసక్తిగా ఉంటారు. కానీ కొన్ని సందర్భాల్లో కొందరు మాత్రం ఈ ఆహ్వానం తిరస్కరిస్తున్నారు. తాజాగా బాలీవుడ్ హీరోయిన్ జరీన్ ఖాన్ కూడా బిగ్‌బాస్ ఆఫర్‌ను నో చెప్పిన వార్త వైరల్ అవుతోంది.
సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన ‘వీర్’ సినిమాతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన జరీన్ ఖాన్, పదేళ్లకు పైగా బాలీవుడ్లో సినిమాలు చేసింది. ప్రత్యేక గీతాలు, స్టేజ్ షోలతోనూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే 2020 తర్వాత సినిమాలకు దూరంగా ఉంటూ, అప్పుడప్పుడు సోషల్ మీడియా ఫోటోషూట్లతో వార్తల్లో నిలుస్తోంది. ఈ మధ్య బిగ్‌బాస్ టీం ఆమెను సంప్రదించగా, జరీన్ మాత్రం ఈ అవకాశాన్ని తిరస్కరించినట్టు తెలుస్తోంది.
ఇప్పుడు జరీన్ ఖాన్ స్వయంగా దీనిపై స్పందిస్తూ,
“నిజమే, నాకు బిగ్‌బాస్ ఆఫర్ వచ్చింది. నాకు బిగ్‌బాస్ షో అంటే ఆసక్తి ఉంది. చాలా సీజన్లు చూశాను. కానీ, ప్రస్తుత పరిస్థితుల్లో నాకు బిగ్‌బాస్ హౌస్‌లో ఉండటం కుదరదు. రోజు ఇంట్లో తల్లి ఆరోగ్యాన్ని తెలుసుకునే బాధ్యత, ఇతర పనులతో బిజీగా ఉంటాను. మూడు నెలలు పూర్తిగా బిగ్‌బాస్ హౌస్‌లో ఉండటం నాకు అసాధ్యం” అని చెప్పింది.
అలాగే,
“కొత్తవారితో ఉండటం కష్టం కాదు కానీ, అంతకాలం ఒకే చోట ఉండడం ఇబ్బంది. ప్రస్తుతం నేను సౌకర్యవంతమైన జీవితం గడుపుతున్నాను. ఆ కంఫర్ట్ జోన్‌ను వదిలి వెళ్లాలనే ఆలోచన లేదు. భవిష్యత్తులో కూడా బిగ్‌బాస్‌లోకి వెళ్లే అవకాశాలు తగ్గినట్టే” అంటూ క్లారిటీ ఇచ్చింది.
జరీన్ ఖాన్ బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెడితే షోకు గ్లామర్‌తో పాటు మంచి కంటెంట్ వస్తుందని నిర్వాహకులు భావించినా, ఆమె మాత్రం తన నిర్ణయాన్ని మార్చేలా లేనట్టే కనిపిస్తోంది.
Recent Random Post:















