
టీమిండియా పర్యటనల సమయంలో బీసీసీఐ తాజాగా అమలు చేసిన ఫ్యామిలీ టైమ్ రూల్‌పై విరాట్ కోహ్లీ విమర్శించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అనుష్క శర్మ భర్తకు మద్దతుగా చేసిన ఇన్స్టాగ్రామ్ పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. ఆటగాళ్ల మానసిక ఆరోగ్యం, వారి కుటుంబం నుంచి అందుకునే మద్దతు ప్రాముఖ్యత గురించి కోహ్లీ స్పష్టం చేయగా, అనుష్క తన అభిప్రాయాన్ని సహజమైన రీతిలో వ్యక్తం చేస్తూ అతనికి అండగా నిలిచారు.
అనుష్క చేసిన పోస్ట్‌లో, “కుటుంబం వేరు… సహచరులు, సహోద్యోగులు వేరు!” అంటూ పేర్కొంటూ, కుటుంబ మద్దతు ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు. బీసీసీఐ నూతన నిబంధనపై కోహ్లీ బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేసిన కొద్ది సేపటికే అనుష్క పోస్ట్ చర్చనీయాంశంగా మారింది. “మీ జీవితంలో ప్రతి ఒక్కరు మీ గురించి భిన్నమైన అభిప్రాయం కలిగి ఉంటారు. కానీ, మీ గురించి మీరే అసలైన వ్యక్తి తెలుసుకోవాలి” అంటూ అనుష్క చేసిన వ్యాఖ్యలు క్రిప్టిక్ మెసేజ్ గా మారాయి.
బెంగళూరులో జరిగిన ‘RCB ఇన్నోవేషన్ ల్యాబ్ – ఇండియన్ స్పోర్ట్స్ సమ్మిట్’ లో కోహ్లీ తన అసంతృప్తిని బహిరంగంగా వెల్లడించారు. “మేము ప్రొఫెషనల్ క్రికెట్ లో తీవ్రమైన ఒత్తిళ్లను ఎదుర్కొంటున్నాం. ఇలాంటి సమయంలో కుటుంబ మద్దతు ఎంత కీలకమో నిర్వాహకులు గ్రహించాలి. బహుశా, ఇలాంటి నియమాలను రూపొందించే వారిని దూరంగా ఉంచితే మంచిది” అంటూ కోహ్లీ ధ్వజమెత్తారు.
కోహ్లీ వ్యాఖ్యల అనంతరం అనుష్క చేసిన పోస్ట్ నేరుగా బీసీసీఐ వివాదాన్ని ప్రస్తావించకపోయినా, దాని అర్థం స్పష్టంగా వ్యక్తమైంది. ప్రస్తుతం కోహ్లీ తన భార్య అనుష్క, పిల్లలతో కలిసి మ్యాచ్‌లకు హాజరవుతుండడం, ఆటగాళ్ల మానసిక ఆరోగ్యానికి కుటుంబం అందించే మద్దతు గురించి కోహ్లీ-అనుష్క కలిసే చెప్పడమే నిర్ణయాధికారుల దృష్టిని ఆకర్షించింది. ఈ వివాదం ఇంకా ఎటు దారి తీస్తుందో చూడాలి!
Recent Random Post:















